Breaking News

ఏపీ విద్యా సంస్కరణలు భేష్

-నెదర్లాండ్స్‌లో జరుగుతున్న ప్రపంచ సదస్సులో మెచ్చుకున్న ఆసియా ప్రతినిధులు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేపడుతున్న విద్యా సంస్కరణలను ప్రశంసిస్తూ అనేక దేశాల మంత్రిత్వ శాఖలు, ప్రభుత్వ అధికారులు మెచ్చుకున్నట్లు స్కిల్ డెవలెప్ మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్. సురేష్ కుమార్ తెలిపారు. నెదర్లాండ్స్ లోని యూట్రెచ్ట్ లో జరుగుతున్న ‘గ్లోబల్ సోషల్ అండ్ ఫైనాన్షియల్ స్కిల్స్ కాన్ఫరెన్స్-2023’లో భారతదేశ ప్రతినిధిగా ఈజిప్ట్, ఫాసో, ఫిలిప్పీన్స్, కిర్గిజిస్తాన్‌లతో పాటు ప్యానెల్ చర్చలో పాల్గొని, విద్యాభివృద్ధికి అగ్రగామిగా నిలుస్తూ మన రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ఆవిష్కరణల గురించి ఆయా దేశాల ప్రతినిధులతో పంచుకున్నారు. ఈ సందర్భంగా ‘‘ఆంధ్రప్రదేశ్ ఎలా విజయం సాధించగలిగింది?’ అని ప్రతినిధులు అడిగిన ప్రశ్నకు, ‘‘ఆంధ్రప్రదేశ్ లో మనకు ఉన్న అద్భుతమైన సెటప్ (మోడల్) అంటే SCERT, DEOలు, DSOలు భాగస్వామ్య సంస్థలైన Aflatoun International, Udhyam Learning Foundation, Reap Benefit సహకారంతో సాధ్యమైందని’’ పాఠశాల విద్యాశాఖ కమీషనర్ ఎస్.సురేష్ కుమార్ ఆ సంస్థలను అభినందిస్తూ చెప్పగా, ఆయా దేశాల ప్రతినిథులు మెచ్చకున్నారు. అనంతరం యూనిసెఫ్, GFLEC (ది గ్లోబల్ ఫైనాన్షియల్ లిటరసీ ఎక్సలెన్స్ సెంటర్) USAతో కొన్ని ఫలవంతమైన చర్చల్లో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *