విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ భవానిపురం సీఐగా కృష్ణ ఆదివారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పనిచేస్తున్న సీఐ అబ్దుల్ సలం ట్రాఫిక్కు పంపడంతో ఆ స్థానంలో కృష్ణను నియమించారు. బాధ్యతలు తీసుకున్న అనంతరం సీఐ కృష్ణ మాట్లాడుతూ శాంతి భద్రతల విషయంలో రాజీలేకుండా పని చేస్తామన్నారు. అసాంఘిక కార్యకలాపాల పై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. అక్రమలకు పాల్పడిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు.
Prajavartha Online Telugu News