మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
హార్వెస్ట్ పండుగ ( కోత పండుగ ) పంట కాలంలో పంటలు పండి దేవుడు ఇచ్చిన సమృద్ధికి కృతజ్ఞతలు తెలియజేయడానికి క్రైస్తవ సోదరులు జరుపుకునే సందర్భం. కృష్ణాజిల్లా ముఖ్య కేంద్రమైన మచిలీపట్నంలో చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియాకు సంబంధించి ప్రొటెస్టెంట్ క్రైస్తవులు పరిశుద్ధ అంద్రెయ మహా దేవాలయం ( సెయింట్ ఆండ్రూస్ కేతడ్రిల్)లో 127 వ కోత పండగ. నోబుల్ కళాశాల సమీపంలో గల నోబుల్ ప్యారిష్ చర్చ్ లో 37 వ కోట పండుగ ఆదివారం ఘనంగా జరిగింది. అలాగే మచిలీపట్నం సుకుర్లాబాద్ లోని మరోవైపున రోమన్ క్యాథలిక్ సంఘానికి చెందిన హొలీ క్రాస్ క్రైస్తవులు బైబిల్ మిషన్ సండే వేడుకను ఘనంగా నిర్వహించుకున్నారు. కోత పండుగ విషయానికొస్తే, ఆరాధన అనంతరం ఆలయ ఆవరణలో వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఏడాది మొత్తం దేవుడు మన పట్ల చేసిన అద్భుత కార్యాలను బట్టి, అనుభవించిన ప్రతి ఉపకారానికి కృతజ్ఞతగా అర్పణలు క్రైస్తవ సోదరులు పెద్ద ఎత్తున సమర్పించారు.
Prajavartha Online Telugu News