తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త :
కలియుగదైవం శ్రీ వేంకటేశ్వరస్వామిని తెలంగాణ పీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఆదివారం దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలు పరిష్కారం కావాలని దేవుడ్ని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే ఏపీ, తెలంగాణ సంబంధాలు బాగుండాలని కూడా వేడుకున్నానని తెలిపారు. అంతేగాక త్వరలో తెలంగాణకు మంచి రోజులు వస్తాయని ఆశిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.
Prajavartha Online Telugu News