విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి కల్పన శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన అనగా మంగళవారం ఉదయం 10 గంటల నుండి పోరంకి శ్రీనివాస నగర్ లో గల HAPPY MINDS – DDUGKY సెంటర్ నందు “మినీ జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి దేవరపల్లి విక్టర్ బాబు తెలిపారు.
ఈ మినీ జాబ్ మేళాలో ప్రముఖ ఎఫ్ట్రానిక్స్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు జోయాలూకస్ జ్యువెలరీ కంపెనీస్ లో గల వివిధ ఉద్యోగాలకు సంబంధించి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు.కావున, జిల్లాలోని 18 సం|| నుండి 26 సం|| ల మధ్య ఇంటర్, ఏదైన డిగ్రీ పూర్తి చేసిన యువతీ యువకులు తమ బయోడేటాతో పాటు అర్హత సంబంధించి జిరాక్స్ మరియు ఆధార్ కార్డ్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు.ఇంటర్వ్యూ లలో ఎంపిక కాబడిన అభ్యర్థులకు నెలకు 16,000/- నుండి అనుభవాన్ని బట్టి 25,000 ల రూపాయల వరకు వేతనం ఉంటుందని తెలిపారు. ఈ సదవకాశాన్ని, జిల్లాలోని నిరుద్యోగ యువత సద్వినియోగ పరచుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి సీపాన శ్రీనివాసరావు కోరారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా skilluniverse.apssdc.in వెబ్సైట్ నందు తమ వివరాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 96666 15539 నందు సంప్రదించగలరు.
Prajavartha Online Telugu News