విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బహిరంగ మార్కెట్లో గోధుమలు ధరలను స్థిరీకరించడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా, భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం మరియుప్రజాపంపిణీ మంత్రిత్వ శాఖ నిర్ణయించిన సబ్సిడీ ధరలకు ఆహార ధాన్యాలను (గోధుమలను) ఇ-వేలం ద్వారా అందిస్తోంది.
ఈ పథకం క్రింద, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియ, గోధుమ ఉత్పత్తుల యొక్క ప్రొసెసర్లు / గోధుమ పిండి మిల్లర్లకు మాత్రమే గోధుమలను అందిస్తుంది (ట్రేడర్లు / బల్క్ కొనుగోలుదారులు అనుమతించబడరు) . అర్హత కలిగిన బిడ్డర్ కనీసం 10 మెట్రిక్ టన్నుల నుంచి గరిష్టంగా 200 మెట్రిక్ టన్నులకు బిడ్ వేయడానికి అర్హులు. బిడ్డర్ సంబంధిత రాష్ట్రం యొక్క ఒక పాన్ మరియు GST/ట్రేడ్ టాక్స్ రిజిస్ట్రేషన్‌తో అన్ని రాష్ట్రాలకు కలిపి పొందగలిగే గరిష్ట పరిమాణం 200 MT. కేంద్ర ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వశాఖ 2.5 LMT గోధుమలను గోధుమపిండిగా మార్చుటకు కిలో గోధుమలను ₹ 21.50/- చెప్పున సెమీ-ప్రభుత్వ మరియు సహకార సంస్థలు, అనగా, కేంద్రీయ భండార్, NCCF మరియు NAFED లకు OMSS (D) కింద కేటాయించుటకు నిర్ణయించారు. ఇలా వచ్చిన గోధుమపిండి MRP ని కిలో ₹ 27.50/- గా నిర్ణయించి “భారత్ బ్రాండ్ “పేరుతోప్రజలకు అందిస్తారు. దీనికి సంబంధించి 10.02.2023న ప్రకటించిన అన్ని ఇతర నిబంధనలు మరియు షరతులు మారవు. బియ్యానికి సంబంధించిన వేలంలో, వ్యాపారులు కూడా పాల్గొనవచ్చు.బియ్యం విషయంలో కనిష్టంగా 10 మెట్రిక్ టన్నులు, గరిష్టంగా 1000 మెట్రిక్ టన్నుల కు బిడ్ వేయడానికి అర్హులు. ఇ-వేలంలో పాల్గొనదలచిన బిడ్డర్ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఎఫ్.ఎస్.ఎస్.ఎ.ఐ లైసెన్స్/ జి.ఎస్.టి. / ట్రేడ్ టాక్స్ రిజిస్ట్రేషన్, పాన్ కలిగి ఉండాలి మరియు గోధుమల ఈ-వేలానికి సంబంధించి భారత ప్రభుత్వ డబ్ల్యు.ఎస్.పి. పోర్టల్‌లో (https://evegolis.nic.in/wsp/login) ప్రస్తుత గోధుమల స్టాక్ హోల్డింగ్‌ను ప్రకటించాలి. విజయవంతమైన బిడ్డర్ MTF లోని ఆండర్టేకింగ్ (అపెండిక్స్ -IV)లో పొందుపరచిన షరతులను వుల్లంగించినట్లైతే, ఆ బిడ్డర్‌ను ఒక సంవత్సరం పాటు OMSS (D) ఇ-వేలం పాల్గొనకుండా డీబార్ చెయ్యడం జరుగుతుంది. నాలుగు అదనపు పేరాలు అంటే, పేరా 8 నుండి పేరా 11 వరకు ఇటీవలే MTF అండర్‌టేకింగ్ (అనుబంధం-lV)లో చేర్చబడ్డాయి, దీని పట్ల బిడ్డర్లు ప్రత్యేక శ్రద్ధను చూపగలరు. 15.11.2023న జరగబోయే ఇ-వేలం కోసం, కేంద్ర పాలిత ప్రాంతమైన పోర్ట్ బ్లెయిర్ కోసం 50 MTల గోధుమలతో సహా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో FCI సుమారు 2700 MTల గోధుమలను మరియు 9000 MTల బియ్యాన్ని ఆఫర్ చే స్తోంది. ఓపెన్ మార్కెట్ సేల్ స్కీమ్-డొమెస్టిక్ ద్వారా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుండి బిడ్డర్ కొనుగోలు చేసిన గోధుమలను తప్పనిసరిగా గోధుమ ఉత్పత్తులుగా ప్రాసెస్ చేయాలి మరియు లిఫ్టింగ్ చివరి తేదీ నుండి 30 రోజులలోపు విక్రయానికి మార్కెట్లోనికి విడుదల చేయాలి మరియు ప్రాసెసింగ్ మరియు బహిరంగ మార్కెట్లో విడుదల చేయడానికి సంబంధించిన పత్రాలను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియకు సమర్పించాలి.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News