-చిత్తూరు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్, నైనారు మధుబాల
తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
నేటి తరానికి గ్రంథాలయాల ప్రాముఖ్యతను, విశిష్టతను మరియు గ్రంధాలయాల సేవలను తెలియజేసే విధముగా ఈ నెల 14 నుండి 20 వరకు స్థానిక అన్నమయ్య సర్కిల్ వద్ద వున్న గ్రేడ్ 1 గ్రంథాలయంలో మరియు యం.ఆర్. పల్లిలోని గ్రేడ్ 2 బాలల గ్రంధాలయయంలో 56 వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ఈ ఏడాది ఘనంగా నిర్వహించుటకు ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్, నైనారు మధుబాల తెలిపారు.
ఈ నెల 14 నుండి 20 వరకు జిల్లా లోని అన్ని గ్రంథాలయాలలో రోజువారిగా ఈ క్రింద విధముగా కార్యక్రమములు నిర్వహించబడునని పేర్కొన్నారు.
తేది:14.11.2023 న గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభ వేడుకలు
తేది:15.11.2023 పుస్తక ప్రదర్శన
తేది:16.11.2023 గ్రంథాలయ ఉద్యమములో పాల్గొన్న వారిని స్మరించుకొనుట
తేది;17.11.2023 కవి సమ్మేళనము
తేది:18.11.2023 విద్యార్థులకు వివిధ రకాల పోటీలు నిర్వహించుట
తేది: 19.11.2023 గ్రంథాలయా వారోత్సవాలలో భాగముగా మహిళా దినోత్సవము
తేది:20.11.2023 డిజిటల్ గ్రంధలయాలపై విద్యార్థులకు అవగాహన, సామూహిక స్వీయపరనం, గ్రంథాలయ వారోత్సవాల ముగింపు వేడుకలు ప్రముఖులచే విద్యార్థులకు బహుమతులు ప్రదానము చేయుట
గ్రంధాలయాల ప్రాధాన్యం సామాజిక స్పృహ, విద్య ప్రాధాన్యతను చాటి చెప్పేలా ఈ గ్రంధాలయ వారోత్సవాలను చిత్తూరు మరియు తిరుపతి ఉమ్మడి జిల్లాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరియు విద్యార్థిని, విద్యార్థులలో స్త్రుజనాత్మకతను వెలికి తీసేందుకు వారికి వక్రుత్వపు పోటీలు, వ్యాస రచన, చిత్రలేఖన, మ్యూజికల్ చైర్ పోటీలు ఉమ్మడి జిల్లాలోని అన్ని గ్రంధాలయాలలో నిర్వహించి వారికి బహుమతులు ప్రదానము చేయనున్నట్లు తెలిపారు.
ఈ వారోత్సవాలలో సందర్భముగా జిల్లా వ్యాప్తముగా పాటకులు తీసుకువెళ్ళిన పుస్తకములు తిరిగి ఇస్తే వాటికి ఆలస్య రుసుము నుంచి మినహాయింపు వుటుందని, కావున పాటకులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోవాలని తెలిపారు. అలాగే ఉమ్మడి జిల్లా వ్యాప్తముగా ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రజలు, గ్రంథాలయ పాటకులు ఈ 56 వ గ్రంథాలయ వారోత్సవాలలో పాల్గొని గ్రంథాయాల బలోపేతానికి దోహదపడాలని మరియు ఈ గ్రంధాలయ వారోత్సవాలను విజయవంతము చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News