తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెల తేదీ 14 15 న రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారిచే సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలు నిర్వహించనున్నారని ఏర్పాట్లను పగడ్బందీగా చేపట్టాలని జిల్లా రెవెన్యూ అధికారి పెంచల కిషోర్ సూచించారు. సోమవారం మధ్యాహ్నం స్థానిక కలెక్టరేట్లో పరీక్షల నిర్వహణపై ఏపీపీఎస్సీ అధికారులతో కలిసి జిల్లా రెవెన్యూ అధికారి సమావేశమయ్యారు. డిఆర్ఓ మాట్లాడుతూ శ్రీనివాస మంగాపురం దగ్గరలో గల ఏఐఎం టెక్నాలజీస్ కేంద్రంగా రెండు రోజులపాటు సచివాలయ ఉద్యోగులకు కంప్యూటర్ పరిజ్ఞాన పరీక్షలు ఉంటాయని అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పకడ్బందీగా చేపట్టాలని అన్నారు. అర్థగంట పాటు 4 సెషన్స్ లో ఈ పరీక్షలు ఉంటాయని 651 మందికి ఉదయం ఉ 9.30-10, మ 12-12.30, 2-2.30, సా 5-5.30 గంటల మధ్య నిర్వహించనున్నామని పరీక్షల సమయాలలో విద్యుత్ శాఖ విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని, అభ్యర్థులకు రవాణా సౌకర్యం వంటి ఏర్పాట్లు ఏపీఎస్ఆర్టీసీ చూడాల్సి ఉంటుందని అందుకు సంబంధించి సెంట్రల్ బస్ స్టేషన్ లో సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని అన్నారు. వైద్యశాఖ మెడికల్ క్యాంపు పంచాయతీ రాజ్ శాఖ త్రాగునీరు సౌకర్యం వంటివి ఏర్పాటు చేయాలని తెలిపారు. నిర్వహణలో ఎలాంటి పొరపాట్లకు తావివ్వరాదని సూచించారు. ఈ సమావేశంలో ఏపీపీఎస్సీ సెక్షన్ ఆఫీసర్లు వెంకటరమణ , శేఖర్, విధులు కేటాయించిన లైసెన్ ఆఫీసర్లు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News