Breaking News

CRISIL ఇచ్చిన నివేదిక మీద ప్రజలలో చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించాలి… : నేతి మహేశ్వర రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
CRISIL అనే సంస్థ S&P Global అనుబంధ సంస్థ ఈ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఈ సంస్థ ఇచ్చే రేటింగ్ లు సంబంధిత సంస్థల భవిష్యత్తు మీద తీవ్ర ప్రభావం ఉంటుంది అలాంటి సంస్థ పదే పదే రేటింగ్ తగ్గిస్తూ ఉన్నాకూడా నిమ్మకునీరెత్తినట్టు ప్రభుత్వం ఉండటం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి అత్యంత ప్రమాదకరం అని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ అధ్యక్షులు నేతి మహేశ్వర రావు అన్నారు. సోమవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో నేతి మహేశ్వర రావు మాట్లాడుతూ ఒక వైపు దిగ్గజ రేటింగ్ సంస్థలు రేటింగ్ A+ A+ నుంచి BBB+ కి తగ్గిస్తుంటే కేంద్రప్రభుత్వం ముబ్బడి దిబ్బడిగా అనుమతులకు మించి అప్పులు ఇవ్వడం చూస్తుంటే దగ్గరుండి మరి ఢిల్లీ ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నట్లు ఉంది అన్నారు. ఆ రోజు మదుపరులు బాండ్ లను కొనడానికి ఎగబడటం దేశీయ మార్కెట్ లోనేకాకుండా అంతర్జాతీయ మార్కెట్ లో కూడా బాండ్ ల ద్వారా నిధులు సేకరించటం సంచలనం సృష్టించిన ఘటన అనుకోవచ్చు అన్నారు. 2020 CRISIL నివేదిక లో రేటింగ్ తగ్గే సూచనలు ఉన్నాయని ముందే హెచ్చరించటం జరిగింది మూడు రాజధానుల ప్రతిపాదన అలాగే ఆస్తులను Amaravathi Metropolitan Region Development Authority (AMRDA) కి బదలాయించటం లాంటి చర్యలతో రేటింగ్ భవిష్యత్తు లో తగ్గబోతుందని నివేదికలో ఇవ్వడం జరిగింది.

2023 లో రేటింగ్ A+ నుంచి BBB+ కి తగ్గించటానికి నివేదికలో చెప్పిన మొదటి కారణం చెల్లింపుల లకు సంబందించిన Debt Service Reserve Account(DSRA) లో (Required 300 Crore Available only Rs 204 Crore)అలాగే Bond Service Account(BSA) లో(Required ~Rs 225 Crore Available Rs ~27 Crore) ఉండవలసిన నిధులు లేకపోవడం అలాగే బడ్జెట్ లో పెట్టిన నిధుల విదుదల లో జాప్యం లాంటి అంశం ఒక కారణం అయితే రెండవ కారణం ఆర్థిక లోటు పతాక స్థాయికి చేరడం( Septmber 2023 కి గాను ఆర్థిక లోటు Rs 38644 కోట్లు మొత్తం సంవత్సరానికి అంచనా వేసిన ఆర్థిక లోటు Rs 22316 కోట్లు ఉంటె 6 నెలలకే 173 శాతం ఆర్థిక లోటు ఉన్నదీ) తెచ్చిన అప్పులను అభివృద్ధికి వాడక పోవడం,సాంఘిక అభివృద్ధి సూచికలో ఆంధ్రప్రదేశ్ అక్షరాస్యత 67% దేశీయ సగటు 74% కన్న తక్కువ ఉండటం,అలాగే ఖర్చులు 26% పెరిగిన పరిస్థితులు, పారిశ్రామిక ప్రతికూల వాతావరం ఉన్న పరిస్థితుల్లో రేటింగ్ A+ నుంచి BBB+ కి తగ్గించటం జరిగిందని నివేదిక లో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అనుకూల/ప్రతికూల వాతావరణం మీద అధ్యయనం చేస్తే ఆ అధ్యయనం లో ముఖ్యంగా మూడు అంశాలు ఆంధ్రప్రదేశ్ లో పారిశ్రామిక వాతావరణం మీద ప్రతికూల ప్రభావం చూపించే పరిస్థితులు రాష్ట్రము లో కనబడుతున్నాయన్నారు

మొదటిది రాజకీయ వాతావరణం ప్రభుత్వాల విధానాల లో స్థిరత్వం లేకపోవడం పాతప్రభుత్వ విధానాలను సమీక్షించటం అలాగే కక్ష పూరిత రాజకీయ వాతావరం విపరీత రాజకీయ వైరుధ్యం స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితులు ప్రతికూల పారిశ్రామిక విధానానికి ముఖ్య కారణం అనుకోవచ్చు.

రెండవ అంశం తీవ్ర ఆర్థిక లోటు ఉన్న రాష్ట్రము లో మూలధనాన్ని మౌలిక సదుపాయాలకు ఖర్చు పెట్టాలిసిన పరిస్థితుల్లో అప్పులు తెచ్చి మరి ఖర్చు పెట్టడం ఇంకా ఆర్థిక లోటు పెంచే విధంగా ఆర్థిక అరాచకత్వం ఉండటం లాంటి పరిస్థితులు రెండవ ప్రతికూల పారిశ్రామిక విధానానికి ముఖ్య కారణం అనుకోవచ్చు.

మూడవ అంశం ఆంధ్రప్రదేశ్ లో చట్టబద్ధ పాలన కి విఘాతం కలిగించే చర్యలు ముఖ్యం గా CID లాంటి ఏజెన్సీ లతో పారిశ్రామిక వేత్తలని, కంపెనీలను హించించే కార్యక్రమాలు కూడా ఆంధ్రప్రదేశ్ అంటే పారిశ్రామిక వేత్తలు భయపడే భయానక పరిస్థితులు మూడవ ప్రతికూల పారిశ్రామిక విధానానికి ముఖ్య కారణం అనుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్ కి సంబందించిన ఆర్థిక పరిస్థితి రోజు రోజుకి దిగజారుతున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితుల మీద అధ్యయనం చేసి పరిస్థితులను చక్కదిద్దాలని కోరుకొంటుంన్నాం అన్నారు. ఆంధ్రప్రదేశ్ GSDP చుస్తే అభివృద్ధి లో దూసుకొని పోతున్నామని చెప్పే ప్రభుత్వం అన్ని బాగుంటే రేటింగ్ A+ నుంచి BBB+ కి తగ్గించటం దేనికి అన్న దాని మీద ప్రభుత్వం ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ప్రొఫెషనల్ ఫోరమ్ తరుపున డిమాండ్ చేస్తున్నామన్నారు. మీడియా ప్రతిపక్షాలు కూడా CRISIL ఇచ్చిన నివేదిక మీద ప్రజలలో చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించాలని కోరుచున్నామన్నారు.

ఈ కార్యక్రమంలో ఫోరమ్ సభ్యుడు సీనియర్ ఛార్టర్డ్ అకౌంటెంట్ జొన్నల గడ్డ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *