తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల చివరి రోజైన నవంబరు 18న పంచమితీర్థానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నట్టు టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. తిరుచానూరులో పంచమితీర్థం ఏర్పాట్లను జేఈవో సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పుష్కరిణిలో గేట్లు, పంచమితీర్థ మండపాన్ని, పద్మ సరోవరంను పరిశీలించారు. భక్తులు ఇబ్బందులు పడకుండా పుష్కరిణిలోనికి ప్రవేశించేందుకు, తిరిగి బయటకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పంచమితీర్థానికి వచ్చే భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు పటిష్టంగా క్యూలైన్లు, బారికేడ్లు ఏర్పాటు చేయాలన్నారు. భక్తుల కోసం అన్నప్రసాదం కౌంటర్లు, తాత్కాలిక మరుగుదొడ్లు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతకుముందు తిరుచానూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, నవజీవన్ కంటి ఆసుపత్రి, పూడి రోడ్డు వద్ద భక్తులు వేచి ఉండేందుకు ఏర్పాటు చేస్తున్న జర్మన్ షెడ్లను జేఈవో అధికారులతో కలిసి పరిశీలించి, పలు సూచనలు చేశారు. జేఈవో వెంట సిఈ నాగేశ్వరరావు, ఎస్ఈ – 3 సత్యనారాయణ, ఆలయ డెప్యూటీ ఈవో గోవిందరాజన్, విజివో బాలిరెడ్డి, అదనపు ఆరోగ్య అధికారి డాక్టర్ సునీల్, తిరుచానూరు సిఐ శివప్రసాద్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Tags tirupathi
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News