Breaking News

ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త‌కు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌నిద్దాం

-జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో దైనందిక విధుల‌తో పాటు ప‌చ్చ‌ద‌నం, ప‌రిశుభ్ర‌తకు ప్ర‌త్యేక ప్రాధాన్య‌త‌నిచ్చి మొక్క‌ల పెంప‌కం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త వంటి చ‌ర్య‌ల్లో అధికారులు, సిబ్బంది భాగ‌స్వాములు కావాల‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎస్‌.డిల్లీరావు సూచించారు.
దైనందిక విధుల్లో భాగంగా మంగ‌ళ‌వారం ఉద‌యం జిల్లా క‌లెక్ట‌ర్ డిల్లీరావు న‌గ‌రంలోని క‌లెక్ట‌రేట్ కార్యాల‌యానికి చేరుకొని కొద్దిసేపు ప‌రిస‌రాల‌ను ప‌రిశీలించి, మొక్క‌ల పెంప‌కం, ప‌రిస‌రాల ప‌రిశుభ్ర‌త‌, పారిశుద్ధ్య చ‌ర్య‌ల‌పై అధికారులు, సిబ్బందికి ప‌లు సూచ‌న‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ప్ర‌భుత్వ ఉద్యోగులు ప‌నిచేసే కార్యాల‌యాల ఆవ‌ర‌ణ‌లో ప‌చ్చ‌ద‌నంతో ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం, కార్యాల‌యాల్లో ప‌రిశుభ్ర‌త ఉన్న‌ప్పుడు మాన‌సిక ప్ర‌శాంత‌తో మ‌రింత ఉత్సాహంతో ప‌నిచేసేందుకు అవ‌కాశ‌ముంటుంద‌న్నారు. జిల్లాల పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ అనంత‌రం ఏర్ప‌డిన ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్‌ను మోడ‌ల్ క‌లెక్ట‌రేట్‌గా తీర్చిదిద్దేందుకు అధికారులు, సిబ్బంది స‌హ‌కార‌మ‌వ‌స‌రన్నారు. ఇప్ప‌టికే మొక్క‌ల పెంప‌కం, ప‌చ్చ‌నైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించేందుకు తీసుకున్న చ‌ర్య‌లు అభినంద‌నీయ‌మ‌ని.. అయితే తాత్కాలికంగా కాకుండా భ‌విష్య‌త్తుకు ఉప‌యోగ‌ప‌డే మొక్క‌ల‌ను నాటి, పెంచాల్సిన బాధ్య‌త చేప‌ట్టాల‌న్నారు. గ్రాండీఫ్లోరా, రాంబ్ల‌ర్‌, మీనియేచ‌ర్‌, హైబ్రిడ్ టీ వంటి కనువిందు చేసే పూల‌మొక్క‌ల‌తో పాటు రావి, వేప‌, టేకు, మామిడి, నేరేడు త‌దిత‌ర మొక్క‌ల‌ను నాటితే ఫ‌లాల‌తో పాటు నీడ‌నిచ్చేందుకు దోహ‌ద‌ప‌డ‌తాయ‌న్నారు. క‌లెక్ట‌రేట్‌లోని మ‌రుగుదొడ్ల‌ను ప‌రిశీలించి.. పురుషుల మ‌రుగుదొడ్లు, స్త్రీల మ‌రుగుదొడ్ల‌కు మ‌ధ్య, మ‌రుగుదొడ్ల త‌లుపులకు ముందువైపు అడ్డుగోడ‌ల‌ను నిర్మించి, వినియోగించుకునే వారికి ప్రైవ‌సీ ఉండేలా చూడాల‌న్నారు. ప‌చ్చ‌ద‌నం ప‌రిశుభ్ర‌త‌, పారిశుద్ధ్యం నిర్వ‌హ‌ణ‌లో క‌లెక్ట‌రేట్‌ను ఇత‌ర కార్యాల‌యాల‌కు ఆద‌ర్శ‌వంతంగా ఉండేలా తీర్చిదిద్దేందుకు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సూచించారు.
క‌లెక్ట‌రేట్ ఆవ‌ర‌ణ ప‌రిశీల‌న‌లో క‌లెక్ట‌ర్ వెంట ప‌రిపాల‌న అధికారి ఇంతియాజ్ పాషా, ఎల‌క్ష‌న్ సెల్ సూప‌రింటెండెంట్ సీహెచ్ దుర్గాప్ర‌సాద్‌, క‌లెక్ట‌ర్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి స‌తీష్ కుమార్‌, గార్డెన్ నిర్వాహ‌కులు స్వామి, సిబ్బంది ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *