-జిల్లాలో మత్స్యకారులకు రాయితీపై రూ. 3 కోట్లతో ఆక్వా హబ్‌లు, ఫిష్ వెండిరగ్ యూనిట్లు మంజూరు
-త్వరలో కృష్ణానదిలో 25 లక్షల చేపపిల్లల విడుదల
-జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మత్స్యకారుకు ఆర్థిక సహాయం అందించి వారి జీవన ప్రమాణాలను పెంచాలనే లక్ష్యంతో రాయితీపై ఆక్వా హబ్‌లు, ఫిష్ వెండిరగ్ యూనిట్లు, సంచార విక్రయ వాహనాలు మంజూరుచేయడం జరిగిందని.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహకారాన్ని అందిపుచ్చుకొని ఆర్థిక పురోగతి సాధించాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు మత్స్యకారులకు సూచించారు. ప్రపంచ మత్స్య దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని కలెక్టరేట్‌లో మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డిల్లీరావు పాల్గొని.. శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జీవితాలను పణంగా పెట్టి రేయింబవళ్లు నదులు, సముద్రాలపై జీవనయానం సాగిస్తున్న మత్స్యకారులు, వారి కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచేందుకు వైఎస్‌ఆర్ మత్స్యకార భరోసా, ఫిషింగ్ హార్బర్లు, ఫిష్ ల్యాండిరగ్ సెంటర్ల ఏర్పాటు, డీజిల్‌పై సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా వంటి పథకాలను అమలుచేస్తున్నట్లు తెలిపారు. మర, యాంత్రిక పడవలతో పాటు సంప్రదాయ పడవలపై వేటకు వెళ్లే మత్స్యకార కుటుంబాలకు లబ్ధికల్పిస్తోందన్నారు. మత్స్యకారులకు మేలు జరిగేలా స్మార్ట్ కార్డులను జారీచేయడంతో పాటు డీజిల్‌పై లీటరుపై రూ. 9 సబ్సిడీ అందించి.. మత్స్యకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. ఫిష్ ఆంధ్రా పథకం ద్వారా నాణ్యమైన చేపలు, రొయ్యలు వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు స్వయంగా మత్స్యకారులే ఆక్వా హబ్‌లు, ఫిష్ వాల్యూ యాడెడ్ యూనిట్లు, లైవ్ ఫిష్ వెండిరగ్ సెంటర్లు, ఫిష్ కియోస్క్‌లు, ఐస్ బాక్సులతో కూడిన ద్వి, త్రిచక్ర మోటారు వాహనాలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మినీ ఫిషింగ్ వెండిరగ్ యూనిట్లు, సీడ్ స్టాకింగ్ రిజర్వాయర్లు ఏర్పాటుచేసుకునేలా సబ్సిడీపై రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు రూ. 3 కోట్ల విలువైన వివిధ యూనిట్ల ఏర్పాటుకు రుణాలు అందించామన్నారు. మత్స్య కారులు బహిరంగ మార్కెట్లో మొబైల్ వాహనాల ద్వారా తాజా మత్స్య సంపదను వినియోగదారులకు నేరుగా విక్రయించుకుని ఆర్థిక పరిపుష్టిని సాధించాలని లక్ష్యంతో సబ్బిడీపై మొబైల్ వాహనాలను మంజూరు చేసినట్లు తెలిపారు. కృష్ణానది, సముద్రంలో వేటాడిన మత్స్య సంపదతో పాటు చెరువుల ద్వారా ఉత్పత్తి చేసిన మత్స్య సంపదను విక్రయించుకోవడంతో పాటు చేపలు, రొయ్యలు, పీతలు వంటి జల సంపదతో తయారు అయిన రెడీ టూ ఈట్ ఉత్పత్తులను మొబైల్ వాహనాల ద్వారా రిటైల్ గా విక్రయించుకునే అవకాశం మత్స్యకారులకు మత్స్యకార సంఘాలకు కల్పించినట్లు ఆయన తెలిపారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా జిల్లాలోని కృష్ణానది పరివాహక ప్రాంతంలో మత్స్యకారులకు మత్స్యసంపదను కల్పించాలనే లక్ష్యంతో 25 లక్షల చేప పిల్లలను త్వరలో విడుదల చేయనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఆర్థిక భరోసాను మత్స్యకారులు అందిపుచ్చుకొని జీవన ప్రమాణాలు మెరుగుపరచుకోవాలని జిల్లా కలెక్టర్ డిల్లీరావు కోరుతూ మత్స్యకారులకు ప్రపంచ మత్స్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఎ.నాగరాజ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్, డెవలప్‌మెంట్ అధికారులు బి. శ్యామ్ లెనిన్‌బాబు, పి.అఖిల, నాగభద్రరావు, మత్స్యకార సంఘాల ప్రతినిధులు లంకే గోవిందరాజులు, నడకుదిటి కాళీ, జిల్లాకు చెందిన మత్స్యకారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News