Breaking News

మహిళల ఆరోగ్యమే సామాజానికి బలం…

-కుటుంబ విలువలను కాపాడేది మహిళలే…
-ఆరోగ్యవంతమైన సమాజం..హిళలతోనే సాధ్యం…
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కుటుంభ వ్యవస్థలో మహిళల పాత్ర అనీర్వచనమని కుటుంబ అభివృద్ధి కోసం ఆహర్నిసలు శ్రమించే మహిళలు పరిపూర్ణమైన ఆరోగ్యవతంగా జీవించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు అన్నారు.
సీతానగరంలోని విజయ కీలాద్రి దేవస్థానం ఆశ్రమంలో చిన్న జీయర్‌ స్వామి ట్రస్ట్‌ సారధ్యంలో వికాస తరంగిణి ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ‘‘మహిళా ఆరోగ్య వికాస్‌’’ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుటుంబ అభివృద్ధి కోసం మహిళలు తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ఎంతో శ్రమించి బరువు బాధ్యతలను మోస్తున్నారన్నారు. ప్రధానంగా మధ్యతరగతి కుటుంబాలలో ఉండే ఆర్థిక ఇబ్బందుల దృష్ట్యా వ్యక్తిగత ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోలేని పరిస్థితిలో ఉంటారన్నారు. అనారోగ్యంతో బాదపడుతున్నప్పటికి కనీసం ఆ భాదను కుటుంబ సభ్యులతో పంచుకోవడానికి కూడా సంశయిస్తారన్నారు. ఈ పరిస్థితులలో మహిళాలకు వైద్యపరమైన సహాయం అందించేందుకు చిన్న జీయర్‌ ట్రస్ట్‌ ముందుకు రావడం అభినందనీయమన్నారు. మహిళలు ఆరోగ్యవంతులుగా ఉన్నప్పుడు సంతానంపై దృష్టి పెట్టి గుణాత్మకమైన విద్యా బుద్ధులు నేర్పించి ప్రయోజకులుగా తీర్చిదిద్దిడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజానికి దోహదపడతారన్నారు. ముఖ్యంగా ఇటీవల మారుతున్న కాలాన్ని బట్టి పనిఒత్తిడికి లోనై మహిళలు వివిధ రుగ్మతులకు గురి అవుతున్నారన్నారు. ఎన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మహిళామణులు తమ కుటుంబ అవసరాలు తీర్చేందుకు వెలకట్టలేని సేవలందిస్తున్నారన్నారు. వీరి ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకోవడం సమాజంలో ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో పాల్గొనడం తనకు ఎంతో సంతోష్యాన్ని ఇచ్చిందన్నారు. ఏ దేశంలోనైనా మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఆ దేశం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న జీయర్‌ స్వామి సంకల్పించిన మహత్తర కార్యక్రమం ద్వారా ఉభయ తెలుగు రాష్ట్రాలలో రెండు లక్షల మందికి పైగా మహిళలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అనారోగ్యంగా ఉన్నవారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దిడంలో అద్వితీయమన్నారు. ప్రస్తుతం ఈ రోజు నిర్వహించిన వైద్య పరీక్షల ద్వారా 500 మందికి పైగా మహిళలకు గర్భాశయం, హృదయ, శ్వాస, చెవి, నేత్ర, దంత కాలేయం, గ్యాస్ట్రిక్‌ ట్రబుల్‌, వెన్నునొప్పి వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి ప్రసిద్ధి పొందిన కార్పొరేట్‌ ఆసుపత్రుల చెందిన వైద్యుల బృందం వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులను అందించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త గోకరాజు గంగరాజు, విజయవాడ నగర పోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, డిప్యూటీ కమిషనర్‌ రవీంద్ర నాథ్‌, కార్యక్రమ సమన్వయకర్త మాధవి రవీంద్ర, ఆశ్రమ నిర్వాహకులు పురాణం వెంకటాచార్య స్వామి,రఘునాథ స్వామి, విఠల్‌ బాబు, విశాఖపట్నం, విజయనగరం మహిళా ఆరోగ్య వికాస బృంద సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *