Breaking News

ధాన్యం సేకరణ, పర్యవేక్షణ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ధాన్యం సేకరణ, పర్యవేక్షణ సమస్యల పరిష్కారానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ డా. పి.సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఖరీఫ్ లో ధాన్యం సేకరణకు పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు దీనిలో భాగంగా ధాన్యం విక్రయాలలో ఎటువంటి ఇబ్బందులు సందేహాలు, సమస్యలు ఉంటే పరిష్కరించడానికి జిల్లా మేనేజర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామన్నారు. కంట్రోల్ రూమ్ లో ఇద్దరు సిబ్బంది అందుబాటులో ఉంటారని ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు రైతులు తమ ఫిర్యాదులను, సందేహాలను, సమస్యలను తెలపవచ్చునున్నారు. ధాన్యం సేకరణలో రైతులకు ఎదురైన సమస్యలను జిల్లా మేనేజర్ కంట్రోల్ రూమ్ నెంబర్ 77020 03571కు ఫోన్ చేసి తమ ఫిర్యాదులు సమస్యలు తెలిపినట్లయితే తగిన పరిష్కారం, సూచనలు పొందవచ్చునని జాయింట్ కలెక్టర్ జిల్లా డా.పి. సంపత్ కుమార్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *