Breaking News

ఇంద్రకీలాద్రి పై సహస్రలింగార్చన సేవ, ఊంజల్ సేవ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి పై కార్తీక మాసం సందర్భముగా దేవస్థానం నందు ఈరోజు ఉ.09 గం. ల నుండి మ 12 గం.ల వరకు ఆలయ అర్చక సిబ్బంది శ్రాస్త్రోక్తముగా సహస్రలింగార్చన సేవ నిర్వహించడం జరిగినది. కార్తీక మాసము సందర్భముగా సాయంత్ర సమయములో నటరాజ స్వామీ ఆలయము ప్రక్కన 06.30 గం.లకు ఊంజల్ సేవ (దీపారాధన సేవ) నిర్వహించడం జరిగినది. భక్తులు విశేషముగా పాల్గొన్నారు.

కార్తీక మాసం సందర్బంగా తేది.14-11-2023 నుండి తేది.12-12-2023 వరకు ప్రతిరోజూ ఉ.గం. 09-00 ల నుండి మ. 12 గం.ల వరకు సహస్ర లింగార్చన సేవ (ఒక రోజునకు రూ.500/-లు టిక్కెట్, నెలకు రూ.5116 /- లు), సాయంత్రం 06.30 గం. లకు ఊంజల్ సేవ(రూ.50 /- లు) ఆర్జిత సేవలుగా నిర్వహించబడును. మరియు ఇతర ఆర్జిత సేవా టికెట్లు దేవస్థానము యొక్క వెబ్సైటు www.kanakadurgamma.org నందు గానీ, www.aptemples.ap.gov.in లేదా దేవస్థానం కౌంటరు నందు కానీ పొందవచ్చును.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *