Breaking News

మండల స్థాయి లోనే జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రోటోకాల్ భాస్కర్ నాయుడు

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
మండల స్థాయి జగనన్నకు చెబుదాం స్పందన అర్జీలపై ప్రత్యేక దృష్టి పెట్టి పరిష్కారo చూపాలని ప్రోటో కాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు వివిధ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని మురళి కృష్ణ దేవస్థానం కళ్యాణ మండపంలో ప్రొటో కాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్ నాయుడు జగనన్నకు చెబుదాం ప్రజల నుంచి స్వీకరించిన అర్జీల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొటో కాల్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మాట్లాడుతూ.. మండల స్థాయిలో వచ్చిన జగనన్నకు చెబుదాం , స్పందన అర్జీలను గ్రామ, మండల స్థాయి అధికారులతో పాటు జిల్లా అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే పలు మండలాలలో మండల స్థాయి జగనన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని అధికారులు ఎలాంటి అలసత్వం లేకుండా అర్జీలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని తెలిపారు. ఈ కార్యక్రమానికి డి ఎల్ డి ఓ సుశీలదేవి, చంద్రగిరి ఎం పి డి ఓ బాలాజీ నాయక్, చంద్రగిరి తాసిల్దార్ శిరీష ,జిల్లా విద్యా శాఖాధికారి శేఖర్,జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి శ్రీహరి, జిల్లా వ్యవసాయ అధికారి ప్రసాద్, సంబంధింత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *