Breaking News

ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో కలవచర్ల లో చేపట్టనున్న నూతన పారిశ్రామిక వాడ శంఖుస్థాపన

-మొత్తం 369 యూనిట్స్ రూ .20.64 కోట్లు నిధులతో  అంచనా విలువ క్లస్టర్ ఏర్పాటు
-కలెక్టర్ మాధవీలత
-ఎమ్ ఎల్ ఏ జక్కంపూడి రాజా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో పరిశ్రమల ఏర్పాటు కు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ డా కె. మాధవీలత పేర్కొన్నారు.

తాడేపల్లి నుంచి  ఎమ్ఎస్ఈ – సిడిపి నిధులతో  అంచనా విలువ గల రూ .20.64 కోట్లతో కలవచర్లలో చేపట్టనున్న నూతన పారిశ్రామికవాడకు ముఖ్యమంత్రి వై.యస్.జగన్ మోహన్ రెడ్డి  వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేశారు.
స్థానిక కలెక్టరేట్ నుంచి కలెక్టర్, శాసనసభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు, డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు ఇతర ప్రజా ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ కె. మాధవీలత మాట్లాడుతూ, రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశ్రమల ఏర్పాటు, వాటికి అనుగుణంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఉద్దేశించిన కార్యాచరణ ప్రణాళికలను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లాల్లో పారిశ్రామిక అభివృద్ధి క్లస్టర్ ల ఏర్పాటుకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని అన్నారు. ఆ మేరకు తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (APIIC) లిమిటెడ్ కోసం రూ. 2,065 లక్షల అంచనాతో మంజూరు చేయబడిన ఫుడ్ ప్రాసెసింగ్ పారిశ్రామిక అభివృద్ధి ప్రాజెక్ట్ కలవచేర్ల లో ఏర్పాటు చెయ్యడం జరుగుతోందని అన్నారు.

సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక ను సంబంధిత అంచనా వ్యయం తో  ప్రధాన కార్యాలయానికి సమర్పించడం జరిగిందన్నారు.  ఏంఎస్ఈ – సిడిపి కేంద్ర ప్రభుత్వ గ్రాంట్ రూ.1050 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం/ ఏపిఐఐసి గ్రాంట్ రూ.1,015 లక్షల తో ఈ ప్రాజెక్ట్ ప్రతిపాదించడం జరిగిందన్నారు.  అంతర్గత రహదారులు, మురుగునీరు పారుదల వ్యవస్థ , ముందస్తు నిర్వహణ ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు తెలియ చేశారు.

రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో  గడిచిన నాలుగున్నర ఏళ్లుగా  సంక్షేమం, అభివృద్ధి, అవినీతి రహిత పాలన దిశగా  పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. రాష్ట్ర అభివృద్ధి కొరకు పారిశ్రామిక ప్రగతి లక్ష్యంగా  సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహితులను ప్రోత్సహిస్తూ ముందుకెళ్తున్నారన్నారు. రాజానగరం నియోజకవర్గంలోని  కలవచర్లలో  104 ఎకరాలు విస్తీర్ణంలో ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఏర్పాటుకు నిధులు సమకూర్చడంతో పాటు  మౌలిక సదుపాయాలు కల్పించే దిశగా నేడు సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో  శంకుస్థాపన కార్యక్రమం చేశారన్నారు. పరిశ్రమల ఏర్పాటు వలన ఈ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అదే విధంగా ఈ మధ్యకాలంలో  రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కోరుకొండ మండలం రాజవరం గ్రామంలో నిర్మించునున్న  ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు వర్చువల్ విధానంలో  శంకుస్థాపన చేయడం జరిగిందని,  ఈ కంపెనీలు నిర్మాణం వలన  నిరుద్యోగ యువతకు  మరింత ఉపాధి అవకాశాలు లభిస్తాయని  శాసనసభ్యులు జక్కంపూడి రాజా పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో డిసిసిబి చైర్మన్ ఆకుల వీర్రాజు, శాసన సభ్యులు జక్కంపూడి రాజా, తలారి వెంకట్రావు,  సహాయ కలెక్టర్ సి. యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎంపిపి  ఎమ్. వీర్రాజు, జిల్లా పరిశ్రమల అధికారి బి. వేంకటేశ్వర రావు  ఏపి ఐఐసి డిప్యూటీ జోనల్ మేనేజర్లు డివిఎస్ఏన్ జ్యోత్స్న దేవి, బి. రాధా మణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, పారిశ్రామిక వేత్తలు తదితరులు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *