-డిసెంబర్ 1 వ తేది వరల్డ్ ఎయిడ్స్ డే ని పురస్కరించుకొని..
-డిఎమ్ హెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు.
-జిల్లా లెప్రసి ఏయిడ్స్ టి.బి. నియంత్రణ అధికారి డా. ఎన్. వసుందర
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 1 వ తేది వరల్డ్ ఎయిడ్స్ డే ని పురస్కరించుకొని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ప్రజలలో హెచ్.ఐ.వి / ఏయిడ్స్ గురించి అవగాహన కల్పించునిమిత్తం ఈనెల 30 వ తేది మధ్యాహ్నం 2 గం నుంచి 4 గం వరకు కోటిలింగాల రేవు వద్ద ముగ్గుల పోటి కార్యక్రమం తదుపరి ప్రపంచ ఎయిడ్స్ డే అవగాహన ర్యాలీ సాయంత్రం 4 గం నుంచి 5 గం వరకు కోటిలింగాల రేవు నుంచి కొటిలింగాలపేట ఆంబెద్కర్ విగ్రహం వరుకు నిర్వహించడం జరుగుతుందని డిఎమ్ హెచ్ ఓ డా. కె. వెంకటేశ్వరరావు, జిల్లా లెప్రసి ఏయిడ్స్ టి.బి. నియంత్రణ అధికారి డా. ఎన్. వసుందర బుధవారం ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు.
డిసెంబర్ 1 వ తేది వరల్డ్ ఎయిడ్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ డా.కె . మాధవీలత అధ్యక్షతన, డి ఏం & హెచ్ ఓ, డి ఎల్ ఏ టి ఓ ఆధ్వర్యంలో కంబాల చెరువు పార్క్ ప్రాంగణంలో హెచ్.ఐ.వి / ఏయిడ్స్ గురించి ప్రజలలొ వున్న అపొహలను తొలగించుట మరియు కమ్యూనిటీ అవగాహన పై సమావేశం నిర్వహించడం జరుగుతుందన్నారు.. అనంతరం జిల్లా కలెక్టర్ హెచ్.ఐ.వి / ఏయిడ్స్ తో జీవిస్తున్న వారితో అల్పాహార విందు స్వీకరించడం జరుగుతుందన్నారు. జిల్లా కలెక్టర్ వరల్డ్ ఎయిడ్స్ డే కార్యక్రమం ఫై సందేశం ఇచ్చుట మరియు హెచ్.ఐ.వి / ఏయిడ్స్ ఫై విశేష కృషి చేస్తున్నవారికి వృత్తి పట్ల నిబద్ధత కలిగిన సిబ్బందికి పురస్కారాలు అందచేయడం మరియు అవగాహన కార్యక్రమాలలో భాగంగా నిర్వహించినటువంటి పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేయడం జరుగుతుందన్నారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి ఆద్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డా.కె.మాధవీలత, డి. యం & హెచ్ . ఓ డా.కె. వేంకటెశ్వరరావు , డి.ఎల్.ఎ.టి.ఒ డా.ఎన్ .వసుంధర, మునిసిపల్ కమిషనర్ ,కె. దినేష్ కుమార్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్విసెస్ అథారిటి, జిల్లా అధికారులు, పాత్రికెయులు , ఏఆర్ టి వైద్య అధికారులు మరియు సిబ్బంది, ఆశా వర్కర్స్, ఏ యెన్ ఏం లు, , రెడ్ రిబ్బ్బన్ క్లబ్, టి పి మరియు యెన్ ఎల్ ఈ పి సిబ్బంది, యెన్ సి సి మరియు యెన్ ఎస్ ఎస్ స్టూడెంట్స్ తదితరులు ఈ యొక్క కార్యక్రమాలలో పాల్గొనడం జరుగుతుందని వారు ఆ ప్రకటనలో తెలిపారు. కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
Prajavartha Online Telugu News