Breaking News

రూ.91.10 కోట్లతో చేపట్టనున్న తొర్రిగెడ్డ కాలువ పై రివర్స్ పంపింగ్ స్కీమ్ నిర్మాణానికి శంకుస్థాపన

-రు. 38 కోట్ల తో 53 అభివృద్ధి పనులకు శంకుస్థాపన
-1300 లబ్ధిదారుల కెళ్ళి పట్టాలు పంపిణీ
-మంత్రి అంబటి రాంబాబు

కోరుకొండ (కాపవరం), నేటి పత్రిక ప్రజావార్త :
వరద ముంపును పూర్తిస్థాయిలో నివారించేందుకు తొర్రిగెడ్డ కాలువ పై రివర్స్ పంపింగ్ స్కీమ్ ను రూ.91.10 కోట్లతో నిర్మాణానికి శంఖుస్థాపన కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు.

బుధవారం రాత్రి కోరుకొండ మండలం కాపవరం గ్రామంలో ఏర్పాటుచేసిన తోర్రి గడ్డ, చెరువుల అభివృద్ధి తదితర 53 పనులు చేపట్టే కార్యక్రమం లో మంత్రి అంబటి రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రాజానగరం శాసనసభ్యులు జక్కంపూడి , విజయలక్ష్మి లు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ వరద ముంపును పూర్తిస్థాయిలో నివారించేందుకు  తొర్రిగెడ్డ కాలువ పై రివర్స్ పంపింగ్ స్కీమ్ నిర్మాణానికి రూ.91.10 కోట్లతో నిర్మించడం జరుగుతుందని పేర్కొన్నారు.
కోరుకొండ, సీతానగరం మండలాల్లోని 53 చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, ఇందులో భాగంగా రూ.38 కోట్లతో చేపట్టే 53 అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసామన్నారు..

ముంపునకు శాశ్వత పరిష్కారం కోరుకొండ, సీతానగరం మండలాలకు గోదావరి ఎగపోటు వరదనీటితో ముంపు సమస్య ఎక్కువగా ఉంటోందని, ఈ రెండు మండలాల్లోని గ్రామాలకు చెందిన 13 వేల మంది రైతుల పొలాలకు ఇబ్బంది కలుగుతోందని, స్థానిక శాసనసభ్యులు జక్కంపూడి రాజా కృషితో ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి పేర్కొన్నారు.

కోరుకొండ మండలం కాపవరం, పశ్చిమగానుగూడెం, కోరుకొండ గ్రామాల్లో పేదల సొంతింటి కలను నెరవేర్చడమే లక్ష్యంగా ఈ గ్రామాల్లో అర్హులైన 1300 మందికి ఇళ్ల స్థలాలుగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఇందుకోసం కాపవరంలో 31 ఎకరాలను కేటాయిం చారని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక అల్లాడిపోతున్న పేదలకు నవరత్నాలు- పేదలందర్కీ ఇళ్లు పథకంలో స్థలం అందనుందన్నారు.

శాసనసభ్యులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ, రాష్ట్రంలో రైతాంగానికి మేలు చేసే కార్యక్రమాలు చేస్తూ, వ్యవసాయ రంగాన్ని దండగ కాదు, పండగ చేస్తూ సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందని అన్నారు. మన నియోజక వర్గంలో విద్యుత్ సమస్య పరిష్కారం చేసే దిశలో 45 కోట్లతో వర్చువల్ ద్వారా శంఖుస్థాపన చేశారు. నియోజక వర్గంలో 75 అర్భికెలని నిర్మించడం జరిగిందన్నారు. రైతు పండించే పంట లకు భరోసా ఇచ్చే క్రమంలో గో డౌన్ లను నిర్మించే దిశలో అడుగులు వేస్తున్నా మని పేర్కొన్నారు. సమర్థవంతమైన విధానంలో సాగు నీరు అందించే క్రమంలో రెండో పంటకు సాగునీరు అందించే సామర్థ్యం పెంచుకోవడం జరిగిందన్నారు.

తోర్రిగడ్డ రిజర్వాయర్ ద్వారా ఈ ప్రాంతంలోని 13 వేల మంది రైతులకు పంట ముప్పు నుంచి రక్షణ లభిస్తోందని అన్నారు. 1300 మంది లబ్ధిదారులకు ఇళ్ళ పట్టాల పంపిణీ చేసే ఒక చక్కటి కార్యక్రమం లో పాల్గొనడం ఎంతో సంతృప్తిని ఇస్తోందని అన్నారు. రాష్ట్రంలో అర్హులకు సంక్షేమ పథకాలు అమలు చేయడం లో అర్హతే ప్రామాణికంగా తీసుకుని అందచేస్తున్న ఘనత వైయస్ జగన్ మోహన్ రెడ్డి కే దక్కిందన్నారు.

ఈ సభకు జక్కంపూడి విజయలక్ష్మి సభకు అధ్యక్షత వహించారు. త్వరలో ఇక్కడ మరో నగరం ఏర్పాటు అవ్వడం జరుగుతోంది. ఆనాడు వైయస్ రాజశేఖరరెడ్డి పేద కుటుంబాల వారిని లక్షాధికారిని చేస్తానని ఆలోచన చేస్తే, నేడు జగన్మోహన్ రెడ్డి కోటీశ్వరుల ని చేసే ఆలోచన చేస్తున్నారు. సంక్షేమానికి చిరునామా వై ఎస్ జగన్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఏ. చైత్ర వర్షిణి, జక్కంపూడి విజయ లక్ష్మి, . జక్కంపూడి గణేష్, తహశీల్దార్ పాపా రావు, ఇతర అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధి లు, నాయకులు, మహిళా లబ్దిదారులు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *