Breaking News

పాత ఎలక్ట్రానిక్‌ సామాన్లు బహిరంగ వేలం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ గాంధీ నగర్‌లోని జిల్లా కారాగారంలో నిరూపయోగంగా ఉన్న పాత ఎలక్ట్రానిక్‌ సామాన్లు డిసెంబర్‌ 9వ తేదిన బహిరంగ వేలం వేయనున్నట్లు కార్మాగార పర్యవేక్షణ అధికారి హంసపాల్‌ ఒక ప్రకటనలో తెలిపారు. కారాగారానికి చెందిన పాతవి రెండు టైర్స్‌ (టాటా ఇన్నోవా) ఒక బ్యాటరి (టాటా ఇన్నోవా)ను బహిరంగ వేలం వేయుటకు నిర్ణయించడం జరిగిందన్నారు. వేలంలో పాల్గొనుటకు ఆసక్తిగల వాటాదారులు 500 రూపాయల ధరావత్తు సొమ్మును చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొన వచ్చునన్నారు. ఎక్కువ మోత్తానికి పాడుకుని నెగ్గిన పాటదారుడు మొత్తం సొమ్మును 18 శాతం జి.ఎస్‌.టితో కలిపి చెల్లించి వస్తువులను స్వాధీనపరచుకోవచ్చున్నారు. బహిరంగ వేలంలో నెగ్గని పాటదారులకు తరువాత సొమ్ము తిరిగి చెల్లిస్తామన్నారు. వేలానికి సంబంధించి ఇతర వివరాలకు 94946 32700, ల్యాండ్‌ లైన్‌ నెంబర్‌ 0866`2574236 నందు సంప్రదించాలని పర్యవేక్షణ అధికారి హంసపాల్‌ ఆ పకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *