Breaking News

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో పాఠశాలల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక నృత్యాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. గురువారం మచిలీపట్నం మండలం, సుల్తాన్నగరంలో మచిలీపట్నం – విజయవాడ జాతీయ రహదారి పక్కన ఉన్న సుమ కన్వెన్షన్ హాల్లో ఏర్పాటు చేసిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో రాష్ట్ర గవర్నర్ జస్టిస్ యస్.అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలల విద్యార్థులతో పాటు జానపద కళాకారులు ప్రదర్శించిన నృత్య రూపకాలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ముందుగా స్థానిక రాజుపేటకు చెందిన లిటిల్ ఫ్లవర్ పాఠశాల విద్యార్థులు స్వాగతం.. సుస్వాగతం అంటూ వేదికపై ఆసీనులైన రాష్ట్ర గవర్నర్ కు కూచిపూడి నృత్యంతో స్వాగతం పలికారు.

అనంతరం, ఆధునిక కాలంలో రసాయనిక ఎరువులతో చేస్తున్న వ్యవసాయం వల్ల భూమికి జరుగుతున్న దుష్పరిణామాలను వివరిస్తూ స్థానిక శ్రీ బాలాజీ విద్యాలయం పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకం విశేషంగా ఆకట్టుకుంది. రసాయన ఎరువుల వాడకం వల్ల గాలి, నీరు, నేల కలుషితం అయ్యి భూసారం క్షీణిస్తోందని, పర్యావరణహితమైన సేంద్రియ వ్యవసాయం వైపు రైతులందరూ అడుగులు వేయాల్సిన ఆవశ్యకతను తెలియజేస్తూ విద్యార్థులు నృత్యాన్ని ప్రదర్శించారు.

అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ సంక్షేమాభివృద్ధి పథకాలపై అవగాహన కల్పిస్తూ జానపద కళాకారులు బుర్రకథను ప్రదర్శించారు. కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారికి అందిస్తున్న ప్రధానమంత్రి గరీభ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి ఆవాస్ యోజన, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి, పీఎం విశ్వకర్మ యోజన, పీఎం హర్ ఘర్ జలజీవన్ మిషన్, పిఎం జన్ ధన్ యోజన, పీఎం సురక్ష బీమా యోజన, పీఎం ఉజ్వల యోజన వంటి 17 రకాల కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన పరుస్తూ బుర్రకథను ప్రదర్శించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *