విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 3వ తేదిన జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల మరియు వయో వృద్దుల సహాయ సంచాలకులు వి. కామ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని డిసెంబర్ 3వ తేదిన కృష్ణా, ఎన్‌టిఆర్ జిల్లాలకు సంబంధించి జిల్లా స్థాయి విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పాల్గొనడం జరుగుతుందన్నారు. జిల్లాలోని విభిన్న ప్రతిభావంతులు, స్వచ్చంద సంస్థల ద్వారా ప్రత్యేక పాఠశాలలో చదువుతున్న దివ్యాంగులు, విభిన్న ప్రతిభావంతులకై పనిచేస్తున్న వివిధ సంఘాలు కార్యక్రమంలో పాల్గొన్ని విజయవంతం చేయాలని విభిన్న ప్రతిభావంతుల హిజ్రాల, వయో వృద్దుల సహాయ సంచాలకులు వి. కామ రాజు ఆ ప్రకటనలో కోరారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News