Breaking News

సంగీత సాహిత్యాలతో తత్వజ్ఞానాన్ని అందించిన కనకదాస జీవితం ఆదర్శప్రాయం

-ఎన్‌టీఆర్‌ జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజంలోని ప్రతి ఒక్కరికీ అర్థమయ్యేలా సంగీత సాహిత్యాలతో అనుసంధానం చేసి తత్వజ్ఞానాన్ని అందించేందుకు ఎంతో కృషిచేసిన కన్నడ కవి, సంగీతకారుడు, స్వరకర్త కనకదాస జీవితం ఆదర్శప్రాయమని జిల్లా కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు అన్నారు. గురువారం కనకదాస జయంతి సందర్భంగా జిల్లా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్‌ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్‌ డిల్లీరావు.. కనకదాస చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కన్నడ కురుబ కుటుంబంలో జన్మించిన కనకదాస విద్య ద్వారా జ్ఞానాన్ని సముపార్జించి సమాజాన్ని అన్ని కోణాల్లో సూక్ష పరిశీలన చేసి, అర్థం చేసుకొని నల చరిత్ర, హరిభక్తిసార, నృసింహస్తవ, రామధ్యానచరితే, మోహన తరంగిణి తదితర రచనలు చేసి సమాజానికి దశదిశ చూపారని.. ఆయన మనకు అందించిన జ్ఞానాన్ని వారసత్వ సంపదను మన ముందు తరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతిఒక్కరిపైనా ఉందని కలెక్టర్‌ డిల్లీరావు పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గిరిజన సంక్షేమ అధికారి, ఇన్‌ఛార్జ్‌ బీసీ సంక్షేమ అధికారి ఎం.రుక్మాంగదయ్య, సహాయ బీసీ సంక్షేమ అధికారి హరిబాబు, సూపరింటెండెంట్‌ రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *