Breaking News

జీఎస్టీ ప్రక్రియ నూతన విధానానికి శ్రీకారం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జీఎస్టీ ప్రక్రియ నూతన విధానానికి శ్రీకారం చుట్టడానికి జీఎస్టీ సేవా కేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వాణిజ్య పన్నులు శాఖ విజయవాడ-1 డివిజన్ జాయింట్ కమీషనర్ అబిశిక్త కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు. జీఎస్టీ సేవా కేంద్రాలు ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని ప్రస్తుత జీఎస్టీ సేవా కేంద్రం ఏర్పాటుతో ఆంధ్రప్రదేశ్ రెండొవ రాష్ట్రంగా అవతరించనుంది. జీఎస్టీ సేవా కేంద్రం ద్వారా బయోమెట్రిక్ ఆధారిత రిజిస్ట్రేషన్ ప్రక్రియకు శ్రీకారం చుట్టి ఆంధ్రప్రదేశ్ లో పైలెట్ ప్రాజెక్ట్ జీఎస్టీ సేవా కేంద్రాన్ని అమలు చేసేందుకు జీఎస్టీ కౌన్సిల్ ఆమోద ముద్ర వేయడం జరిగిందన్నారు. జీఎస్టీ కేంద్రం ద్వారా హై రిస్క్ కేటగిరిగా నమోదైన రిజిస్ట్రేషన్ దరఖాస్తులను పరిశీలించి సక్రమంగా ఉన్నట్లు నిర్దారించిన అనంతరం రిజిస్ట్రేషన్ల మంజూరుకు సిపార్సు చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్రంలో తొలిసారిగా విజయవాడ లో ఏర్పాటు చేసిన జీఎస్టీ సేవా కేంద్రాన్ని రాష్ట్ర ఆర్ధిక ప్రణాళిక శాసనసభ వ్యవహారాల వాణిజ్య పన్నులు శాఖ మత్స్యులు బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి ఈ నెల 4న సోమవారం ఉదయం ప్రారంభిస్తారని తెలిపారు. కార్యక్రమంలో సీబీఐసీ ఉన్నతాధికారులు, వాణిజ్య పన్నులు శాఖ ఉన్నతాధికారులు పాల్గొననున్నారని అబిశిక్త కిషోర్ ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *