Breaking News

పొందుగుల మహిళల శక్తీ సామర్ధ్యాలు రాష్ట్ర మహిళలకు స్ఫూర్తిదాయకం

-3.50 లక్షల జలజీవన్ మిషన్ నిధులతో పైపు లైను నిర్మాణం పూర్తిచేసిన పొందుగుల మహిళలు
-పొందుగుల గ్రామ సమాఖ్య మహిళలను అభినందించిన జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొందుగుల గ్రామ సమాఖ్య మహిళల సంఘటిత శక్తి సామర్ధ్యాలు ఐక్యత ఆర్ధిక స్వావలంబన సామజిక స్పృహ రాష్ట్ర మహిళలకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు గ్రామ సమాఖ్య మహిళలను అభినందిచారు. కమ్యూనిటీ కాంట్రాక్టు విధానంలో పొందుగుల గ్రామం నందు ఇంటింటికి కుళాయి పనులను విజయవంతంగా నిర్వహించిన పొందుగుల గ్రామ సమాఖ్య సభ్యులు బి. ఆదిలక్ష్మి, ఎ . ఉమారాణి, బి. ఎలిజబెత్ రాణి, జి. వెంకటేశ్వరమ్మ, జి. బన్ని లను శనివారం జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు నగరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో దుశ్శాలువతో సత్కరించి అభినందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ పొందుగుల మహిళ గ్రామ సమాఖ్య మహిళలనుద్దేశించి మాట్లాడుతూ మీ శక్తీ సామర్ధ్యాలు ప్రతి మహిళకు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని సంఘటిత శక్తితో సాధించలేనిది ఏది లేదని నిరూపించారని ఆర్ధిక స్వాలంబనకు మీరు చూపిన చొరవ స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు. మహిళలకు ఆర్ధిక స్వాలంబన కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తుందని వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పొందుగుల గ్రామ సమాఖ్య సభ్యులు చూపిన చొరవ శక్తీ సామర్ధ్యాలు రాష్ట్రంలోకి స్వయం సహాయక బృందాల మహిళలకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు. కమ్యూనిటీ కాంట్రాక్టు విధానం ద్వారా పొందుగులలో జల జీవన్ మిషన్ నిధుల 3.50 లక్షల రూపాయల అంచనాతో డిస్ట్రిబ్యూషన్ పైపు లైను నిర్మించి పనులు 35 కుళాయిలను ఏర్పాటు చేసేందుకు పనులను అప్పగించడం జరిగిందన్నారు. అయితే మంజూరు చేసిన నిధులలో కేవలం 2లక్షల 55 వేలకే 50 గృహాలకు ఇంటింటికి కుళాయిలు అమర్చి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. తద్వారా ప్రభుత్వానికి 95 వేల రూపాయలు ఆదాయం చేయడంతో పాటు అప్పగించినదానికి అదనంగా మరో 15 గృహాలకు నీటి సౌకర్యం కల్పించి ఆదర్శప్రాయంగా నిలిచారన్నారు. ప్రభుత్వ పరంగా నిర్వహించే పనులు గ్రామ సమాఖ్య మహిళలు చేపట్టడం ద్వారా ఉపాధి అవకాశాలు నైపుణ్యం పెంచుకునేందుకు దోహదపడతాయన్నారు. జవాబుదారీ తనం పర్యవేక్షణ భాగస్వామ్యంతో పనులను నిర్వహించడం వలన నాణ్యత పెరగడంతో పాటు నిర్మాణ వ్యయం తగ్గి నిర్దిష్ట కాలంలో పనులను పూర్తిచేయగలిగారన్నారు. పంచాయితీరాజ్ గ్రామీణ అభివృద్ధిశాఖ ప్రత్యేక కార్యదర్శి బి. రాజశేఖర్ వ్యక్తిగత చొరవ తీసుకొని జల జీవన్ మిషన్ నిధుల ద్వారా కమ్యూనిటీ కాంట్రాక్ట్ విధానంలో గ్రామ సమాఖ్య మహిళలతో పనులు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారన్నారు. ఇందుకు ఆయన రాష్ట్రంలో ప్రప్రథంగా పొందుగుల గ్రామాన్ని ఎంపిక చేశారని జిల్లా గ్రామీణాభివృద్ధి ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. శ్రీనివాసరావు పర్యవేక్షణలో గ్రామ సమాఖ్య మహిళలకు పనులు అప్పగించారన్నారు. ఆయన మహిళలపై పెట్టుకున్న నమ్మకాన్ని ఇనుమడింప చేసే విధంగా సంఘటిత శక్తి నాయకత్వ లక్షణాలతో విజయవంతంగా పనులను పూర్తిచేసి 30 గృహాలకు కుళాయిలను అమర్చి గ్రామస్తుల అభినందనలను అందుకున్నా పొందుగుల గ్రామ సమాఖ్య మహిళలను ప్రతి మహిళ ఆదర్శంగా తీసుకొని శక్తి సామర్ధ్యాలను మరింత పెంచుకోవడం ద్వారా ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు కోరారు.
పొందుగుల గ్రామ సమాఖ్య మహిళలను అభినందించిన వారిలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ కె. శ్రీనివాసరావు, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఎస్ ఇ దేవినేని వెంకటరమణ, జిల్లా సహకార అధికారి శాఖ సిహెచ్. శైలజ, ఎపియం యం. శామ్యూల్, ఐబీ పవన్ జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *