Breaking News

తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలు చేపట్టండి..

– కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
– డివిజన్, మండల హెడ్ క్వార్టర్స్ లోనూ కంట్రోల్ రూమ్ ఏర్పాటు..
– పంటను భద్రపరుచుకునేందుకు రైతులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోండి
– మత్స్యకారులు వేటకు వెళ్ళరాదు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మియాచౌంగ్ తుఫాను హెచ్చరిక నేపథ్యంలో జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వాతావరణ శాఖ ఈ నెల 3 నుంచి 5వ తేది వరకు తుఫాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాకు తుఫాను ప్రభావం తగ్గేవరకు అధికారులు అందుబాటులో ఉండటంతో పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించకుండా అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. తుఫాన్ హెచ్చరిక నేపథ్యంలో కలెక్టరేట్లో 0866- 2575833 కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు డివిజన్ మండల హెడ్ క్వార్టర్స్ లోను కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్టు,24 గంటలు విధులు నిర్వహించేలా అధికారులు సిబ్బందిని నియమించినట్లు కలెక్టర్ డిల్లీరావు అన్నారు.
ఆగ్నేయ నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం సోమవారం సాయంత్రం చెన్నై -మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉందని, దీని ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్నారు. ఈనెల 3వ తేదీ నుంచి 5వ తేదీ వరకు తుఫాను ప్రభావం ఉంటుందని, ఈ నేపథ్యంలో రైతులందరూ తమ పంటను కాపాడుకునేలా వ్యవసాయ శాఖ అధికారులు ముందస్తుగానే అప్రమత్తం చేయాలని అన్నారు. పనల మీద ఉన్న పంటను కుప్పలు వేసుకునేలా చేస్తూ, కోయని పంటను వాయిదా వేసుకునేలా రైతులను అప్రమత్తం చేయాలని సూచించారు. దీనికై గ్రామాలలో ప్రచార మాధ్యమాలు, చాటింపుల ద్వారా హెచ్చరికలు చేయాలన్నారు. తుఫాను తీవ్రతను బట్టి అవసరమైతే లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *