Breaking News

తుఫాను దృష్టా ఎక్కడ కూడా రేషన్ పంపిణి ఆపడానికి లేదు…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఇవాళ ఆదివారం తిరుపతి జిల్లా జాయింట్ కలెక్టర్ చిల్లకూరు, కోట, వాకాడు, మండలం లో గ్రామాలను తనికీ నిర్వహించి రేషన్ పంపిణి ని పరిశీలించి తుఫాను దృష్టా ఎక్కడ కూడా రేషన్ పంపిణి ఆపడానికి లేదని, అందరు తహసీల్దార్లు రేషన్ పంపిణి సకాలంలో పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవలసిందిగా ఆదేశించారు. తుఫాను దృష్టా అందరు అధికారులు అందుబాటులో ఉండి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా చూడాలని ఆదేశించారు. వాగులు, చెరువులు పొంగి ప్రవహిస్తుంటే వెంటనే తగు రక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు గర్భినులను, దీర్ఘకాళిక రోగులను పరిశీలించి తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశాలు జారీచేసారు. త్రాగు నీరు సరఫరా, విధ్యుత్ సరఫరా కు ఎటువంటి ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *