Breaking News

పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలిన…

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాన్ ప్రభావం కారణంగా నగరంలో కురుస్తున్న వర్షాల వలన ప్రజలకు ఎటువంటి ఇబ్బందీ కలగకుండా నగరంలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న పనులను పరిశీలిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ హరిత. లోతట్టు ప్రాంతాల్లో ఇండ్లలో నీరు చేరడంతో ఆ ప్రాంతాల్ని పరిశీలించి దగ్గరలోని పాటశాలల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని, నీరు సజావుగా వెళ్లేలా మురుగునీటి కాలువల్లో చెత్త తొలగించాలని, పారిశుద్ధ్య పనులు చేపట్టాలని, నగర పాలక సంస్థ అన్ని విభాగాల అధికారులు సిబ్బంది తమ వార్డు పరిధిలో అందుబాటులో ఉండి తక్షణ చర్యలు చేపట్టాలని కమిషనర్ ఆదేశించారు. వైర్లెస్ సెట్ ద్వారా అన్ని విభాగాల అధికారులను కమిషనర్ కో ఆర్డినేట్ చేస్తూ ఎప్పటికప్పుడు విషయాలు తెలుసుకుని చేపట్టాల్సిన చర్యలపై సూచనలు చేశారు. వీరి వెంట డిప్యూటీ మేయర్ ముద్ర నారాయణ, డిప్యూటీ కమిషనర్ చంద్రమౌలీశ్వర రెడ్డి తదితరులు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *