Breaking News

తుఫాను తీవ్రత దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండండి..

-పంట, ఆస్తి, ప్రాణ నష్టాలు జరగకుండా చర్యలు తీసుకోండి..
-జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్‌ తుఫాను నేపథ్యంలో జిల్లాలో విసృతంగా వర్షాలు కురుస్తాయని వాతావారణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని అధికారులు నిరంతరం అప్రమత్తంతో పంట, ఆస్తి, ప్రాణ నష్టాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు ఆదేశించారు.
మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా వాతావరణ శాఖ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకుని చేపట్టవలసిన చర్యలపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా కలెక్టర్‌ ఎస్‌. డిల్లీ రావు, అనంతరం జిల్లా అధికారులతో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.
కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ మిచౌంగ్‌ తుఫాను తీరం దాటే సమయంలో జిల్లాలో విసృతంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరికలను పరిగణంలో తీసుకుని అధికారులందరు అప్రమత్తంతో ఉండాలన్నారు. ఇప్పటికే జిల్లా రైతులు వరికోతలు చేపట్టకుండా నివారించడం జరిగిందన్నారు. 41,163 హెక్టారులలో రైతులు వరి పంటను చేపట్టడం జరిగిందన్నారు. ఇందులో 6,520 హెక్టారులో వరికోతలు కోయడం జరిగిందన్నారు. 45,108 మెట్రిక్‌ టన్నులు ధాన్యం దిగుబాడి కాగా ఇందులో 12,993 మెట్రిక్‌ టన్నులు బహిరంగ మార్కెట్‌ ద్వారా రైతులు అమ్మకోవడం జరిగిందని మరో 28 వేల మెట్రిక్‌ టన్నులు గోడౌన్‌లోను సురక్షిత ప్రాంతంకు తరలించడం జరిగిందన్నారు. 2,391 మెట్రిక్‌ టన్నులు రైతు భరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయడం జరిగిందన్నారు. 3వ తేదిన వాతావారణ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని 324 మెట్రిక్‌ టన్నులు ఆఫ్‌లైన్‌, 200 మెట్రిక్‌ టన్నులు ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోలు చేసి రైతులకు ఎటువంటి నష్టం కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. 1200 మెట్రిక్‌ టన్నులు ధాన్యం కుప్పలు వేసి ఉందని వాతావారణం అనుకూలించిన వెంటనే తేమ శాతం ఉన్నప్పటికి ఆర్‌బికెల ద్వారా కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. అధిక వర్షాపాతం కురిసే అవకాశం ఉన్నందున కొండ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. కొండ చర్యలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించి సమీపంలో నివాసిస్తున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఒపెన్‌ డ్రైన్స్‌ పై దృష్టి పెట్టి వర్షపు నీరు పారేలా చర్యలు తీసుకుని నిల్వ ఉండకుండా చూడాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. ఈదురు గాలులు వీచే ఆవకాశం ఉన్నందున హోర్డింగ్‌ పై దృష్టి పెట్టి హోర్డింగ్‌ దెబ్బతిన్నప్పటికి సమీపంలో ఎటువంటి నష్టాం జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతం, గ్రామీణ ప్రాంతాలలో పూరిగుడిసెలు, పురాతన గృహాలను గుర్తించి నివాసితులను అప్రమత్తం చేయాలన్నారు. విపత్కర పరిస్థితులలో ఎదురై బాధితులను తరలించవలసి వస్తే ముందుగానే పునరవాస కేంద్రాలను గుర్తించి మౌలిక వసతులను కల్పించేందుకు ప్రణాళికతో చర్యలు తీసుకోవాలన్నారు.
కాన్ఫరెన్స్‌లో నగరపోలీస్‌ కమీషనర్‌ కాంతి రాణా టాటా, జాయింట్‌ కలెక్టర్‌ డా.పి.సంపత్‌ కుమార్‌, మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌, సబ్‌ కలెక్టర్‌ అదితి సింగ్‌, జిల్లా వ్యవసాయ అధికారి యస్‌. నాగమణెమ్మ, ఉద్యాన అధికారి బాలాజీ కుమార్‌, జిల్లాకు చెందిన ఆర్డీవోలు, తహసిల్దార్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *