-నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రధాన కార్యాలయం లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ లో సోమవారం జరిగిన స్పందన కార్యక్రమంలో వచ్చిన 10 ఫిర్యాదులకు విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారాలు అందించాలని అధికారులకు ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ విభాగానికి 4 , పి ఒ (యు.సి.డి.)-1, హెల్త్ విభాగానికి 3, ఎస్టేట్ విభాగానికి 2, మొత్తం కలిపి 10 ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ జోనల్ కమిషనర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్పందన పాల్గొంటారని తద్వారా ఎటువంటి సమస్యనైనా ఎవరి పరిధిలో ఉన్న పరిష్కారం కచ్చితంగా దొరుకుతుందని అలాగే ప్రతి సోమవారం ప్రతి జోనల్ ఆఫీస్ లో మరియు సచివాలయంలో స్పందన కార్యక్రమం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకుని తమ సమస్యలను అధికారులకు తెలియపరచి పరిష్కరించుకోవాల్సిందిగా కోరారు. ప్రజల నుంచి అందుకున్న ఈ ఫిర్యాదులకు సత్వర పరిష్కారాలు ఇవ్వాలని సంబంధిత విభాగం అధికారులకు కమిషనర్ గారు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ కె.వి సత్యవతి, చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళి, చీఫ్ ఇంజనీర్ ప్రభాకర్ రావు, సిటీ ప్లానర్ జీవి జీ ఎస్ వి ప్రసాద్, డిప్యూటీ కమీషనర్ (రెవిన్యూ) వెంకటలక్ష్మి, ఏ డి హెచ్ శ్రీనివాస్, ఏ ఓ నరసింహ మూర్తి, ఆర్.యఫ్.ఓ. వెంకటేశ్వరావు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News