Breaking News

సీఎం జగన్ కి వెయ్యి రెట్లు పెరిగిన ప్రజాదరణ

-రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో ఎనిమిదో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వానికి నాలుగున్నరేళ్లలో ప్రజాదరణ వెయ్యి రెట్లు పెరిగిందని ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 58 వ డివిజన్ 240 వ వార్డు సచివాలయ పరిధిలో డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి సోమవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. సన్ సిటీ కాలనీ, షణ్ముఖ సాయి నగర్లలో విస్తృతంగా పర్యటించి.. 78 గడపలను సందర్శించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి పనులపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ.. వారి నుండి సలహాలు, అర్జీలు స్వీకరించారు. సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా రూ. 5.29 కోట్ల లబ్ధి చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా రూ. 3.17 కోట్లు మొత్తంగా రూ. 8.46 కోట్ల మేర మేలు చేకూర్చినట్లు వెల్లడించారు. 2014 ఎన్నికల్లో వంద పేజీల మేనిఫెస్టో ఇచ్చిన చంద్రబాబు అందులో ఏ ఒక్కటి అమలు చేయలేదని మల్లాది విష్ణు పేర్కొన్నారు. తెలుగుదేశం పాలన అంతా హామీలతో సాగిందని.. 14 ఏళ్ల పాటు పాలించిన చంద్రబాబు దుర్మార్గపు పాలనను ప్రజలు తిరిగి కోరుకోవట్లేదన్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.

తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
మిచాంగ్ తుఫాను పట్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే మల్లాది విష్ణు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని సూచించారు. వాతావరణ హెచ్చరికలతో ఇప్పటికే అధికార యంత్రాంగం పూర్తిగా అలర్డ్ అయిందన్నారు. ఎటువంటి విపత్కర పరిస్థితులు తలెత్తినా సమర్థంగా ఎదుర్కొనేలా.. అన్ని విభాగాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారన్నారు. కలెక్టరేట్లతో పాటు తీర ప్రాంతాల్లోని అన్నీ రెవెన్యూ కార్యాలయాల్లో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యుత్, రవాణా, కమ్యూనికేషన్ల వ్యవస్థ దెబ్బతింటే.. యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. తుఫాను రక్షిత భవనాలు సిద్ధం చేయడంతో పాటు అవసరాన్ని బట్టి ప్రజలను తరలించేందుకు.. పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆహారం, త్రాగునీరు, నిత్యావసరాలు, పాలు వంటివి అందుబాటులో ఉంచేలా ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. అలాగే ముఖ్యమంత్రి దిశానిర్దేశంతో మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయక చర్యల్ని అధికారులు, ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి దగ్గరుండి సమీక్షిస్తున్నారని తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు అవుతు శ్రీనివాసరెడ్డి, అఫ్రోజ్, శర్మ, తోపుల వరలక్ష్మి, శోభన్, నేరెళ్ల శివ, మహేశ్వరి, అన్ని శాఖల అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *