– 2023, జులై 16 నుంచి ఇప్పటివరకు 80 క్లెయిమ్‌ల నమోదు
– ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైఎస్ఆర్ బీమా పథకం ద్వారా అన్ని ధ్రువపత్రాలతో క్లెయిమ్ నమోదు చేసిన వారం రోజుల్లోనే నామినీ బ్యాంకు ఖాతాకు నగదు జమవుతోందని.. పథకం ద్వారా జిల్లాలో 2023, జులై 16 నుంచి ఇప్పటివరకు 80 క్లెయిమ్‌లు నమోదుకాగా 46 క్లెయిమ్‌లను పరిష్కరించి నామినీల బ్యాంకు ఖాతాల్లో నగదు జమచేయడం జరిగిందని కలెక్టర్ ఎస్.డిల్లీరావు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రమాదంలో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆసరాగా నిలబడేందుకు రూ. 5 లక్షలు బీమా మొత్తాన్ని అందించే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి మార్గదర్శకాలకు అనుగుణంగా పథకం అమలవుతోందని తెలిపారు. 2023, జులై 15 వరకు ప్రమాద బీమాను ఇన్సూరెన్స్ కంపెనీల ద్వారా అమలుచేయడం జరిగిందని.. అయితే క్లెయిమ్‌ల పరిష్కారంలో తీవ్ర జాప్యం వల్ల బాధిత కుటుంబాలు ఇబ్బందిపడుతున్నాయని గుర్తించి ప్రభుత్వం జులై 16 నుంచి ప్రభుత్వం ద్వారానే బీమా పథకాన్ని అమలుచేస్తున్నట్లు వివరించారు. బీమా క్లెయిమ్‌లను త్వరితగతిన పరిష్కరించి పేద కుటుంబాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. డీఆర్‌డీఏ ద్వారా పథకంతో ప్రయోజనం పొందేందుకు తమ పరిధిలోని సచివాలయ సిబ్బందిని సంప్రదించాలని కలెక్టర్ డిల్లీరావు సూచించారు.
Prajavartha Online Telugu News