Breaking News

తుఫాను కారణంగా జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలు ఇంటర్, డిగ్రీ కళాశాలలకు శెలవు

-జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాను కారణంగా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిసి ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీచేసిందన్నారు. ఈ నేపథ్యంలో విస్తారంగా కురుస్తున్న వర్షాన్ని దృష్టిలో పెట్టుకొని జాగ్రత్త చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఇంటర్, డిగ్రీ కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు 5వ తేదీ మంగళవారం శెలవు దినంగా ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు మంగళవారం శెలవు దినంగా ప్రకటించామని మంగళవారం అంగన్వాడీ కేంద్రాలకు శెలవు ప్రకటించినందున గర్భవతులు, బాలింతలు, చిన్నారులు అంగన్వాడీ కేంద్రాలకు తరలి రవ్వొద్దని కొరారు. అలాగే పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ కళాశాలలకు శెలవు ప్రకటించినందున యజమాన్యాలు తగు చర్యలు తీసుకొని శెలవు దినాన్ని పాటించాలని కలెక్టర్ ఢిల్లీరావు ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *