విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో సంభవించే భారీ వర్షాలను దృష్టిలో ఉంచుకొని రైతులు కోత కోసిన ధాన్యమును నిల్వ చేసుకునే సౌకర్యము లేని వారు తమ ప్రాంత పరిధిలో గల మార్కెట్ యార్డు గోదాములలో భద్రపరచుకొనవచ్చునని వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు కే శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి నెల్లూరు, గుంటూరు, ప్రకాశం, కృష్ణా, మరియు పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనన్నారు. ఇతర వివరాలకు ఆయా ప్రాంత పరిధిలోని వ్యవసాయ మార్కెట్ కమిటీల కార్యదర్శులు, నిబ్బందిని సంప్రదించి ధాన్యాన్ని భద్రపరచుకోవచ్చునని తెలిపారు. ఇతర వివరాలకు ప్రాంతీయ సంయుక్త సంచాలకులు, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ, విజయవాడ వారి కార్యాలయములో ఏర్పాటుచేసిన 73311 54812 ( ఎ. సుకుమార్ ) టోల్ ఫ్రీ నెంబరును సంప్రదించ వచ్చునని ఆయన ఆ ప్రకటనలో తెలిపారు.
Tags vijayawada
Check Also
అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం
-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …
Prajavartha Online Telugu News