-నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ మేయర్ రాయన భాగ్యలక్ష్మి సోమవారం ఉదయం పశ్చిమ నియోజకవర్గం పరిధిలో గల 46వ డివిజన్, 142 వ సచివాలయంలో వైఏపీ నెడ్స్ జగన్ కార్యక్రమం మరియు పల్లెకు పోదాం కార్యక్రమంలో పాల్గొని సంక్షేమ బోర్డును ఆవిష్కరించి, కేఎల్ రావు పార్క్ స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న వైఎస్సార్సీపి జెండాను పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు వెల్లంపల్లి శ్రీనివాస్ తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ నగరంలో ఇప్పుడు ఉన్నటువంటి సీసీ రోడ్లు, పేవర్ బ్లాక్ తో కూడిన డస్ట్ ఫ్రీ రోడ్లు, నీటి సరఫరా, పార్కులు అభివృద్ధికి నిదర్శనమని, సంక్షేమం అభివృద్ధి రెండు కాళ్ళగా విజయవాడ నగరం ముందుకెళుతుందని. రాష్ట్రవ్యాప్తంగా నాలుగు లక్షల అరవై తొమ్మిది కోట్లు సంక్షేమ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరిందని, రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటేనే సంక్షేమం అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు
Prajavartha Online Telugu News