Breaking News

20 లక్షల రూపాయలు తో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత తూర్పు నియోజకవర్గంలో మునుపెన్నడూ లేనివిధంగా వందల కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి అని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు. సోమవారం 18వ డివిజన్ ఆర్ సి యమ్ స్కూల్ వద్ద 20 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నూతనంగా నిర్మించనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణానికి జరిగిన శంకుస్థాపన కార్యక్రమానికి అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గత టీడీపీ ప్రభుత్వం మాదిరిగా శంకుస్థాపన లు చేసి ప్రచారాలు చేసుకుని వదిలేయకుండా నాణ్యత లోపం లేకుండా నిర్మాణలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నామని అన్నారు. నియోజకవర్గ పరిధిలోని ప్రతి డివిజన్ లో నూతన రోడ్లు, సైడ్ డ్రైనేజ్ లు, పార్కులు, కమ్యూనిటీ హల్ ల నిర్మాణలు చేపట్టడం జరిగిందని, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు నేరుగా ఇంటి వద్దకే అందిస్తున్న ఘనత వైసీపీ ప్రభుత్వం దే అని అన్నారు. కేవలం రాజకీయ లబ్ది కోసమే ప్రతిపక్ష టీడీపీ, దాని తోక పార్టీలు అనుకూల మీడియాను అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేస్తున్నారు అని విమర్శించారు. తూర్పు నియోజకవర్గ అభివృద్ధి మీద చర్చకు సిద్ధమా అని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కి అవినాష్ సవాలు విసిరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గా, ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, బిక్షాల రెడ్డి, కుమ్మరి నాగేశ్వర రావు మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *