Breaking News

జిల్లాలోని రైతులకు కలెక్టర్ విజ్ఞప్తి

-తుఫాను ప్రభావాన్ని ఎదుర్కొనుటకు జిల్లా యంత్రాంగం సిద్దం వుంది.
-కంట్రోల్ రూం లను ఏర్పాటు చేసి పరిస్థితిని సమీక్ష చేస్తున్నాం
-కోతలు కోసిన నిలవ ఉన్న పంటల వివరాలు కంట్రోల్ రూం కి సమాచారం ఇవ్వాలి
-వర్షాలు తగ్గే వరకు రానున్న రెండు మూడు రోజులు కోతలు చేపట్టవద్దు
-కలెక్టర్ డా.కె.మాధవి లత

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో మిచౌంగ్ తుఫాన్ ప్రభావం వలన ఎటువంటి పరిస్థితులు ఉత్పన్నమైన ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని జిల్లా కలెక్టర్ డా. కె. మాధవీలత మంగళ వారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ డా. కె. మాధవీలత రైతులకు విజ్ఞప్తి చేస్తూ మిచౌంగ్ తుఫాన్ వలన ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని, మరోవైపు ఇప్పటికే కోసిన పంట పొలాల్లో నిలువ ఉన్న ధాన్యాన్ని మిల్లు లకు తరలించే లక్ష్యంతో అధికారులను అప్రమత్తం చేస్తున్నమన్నారు. ఇప్పటికే ఆమేరకు అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు. జిల్లాలో కోస్టల్ తీర ప్రాంతం లేనప్పటికీ , తుఫాను ప్రభావం వలన భారీ గాలులు, ఈదురు గాలులు, భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఎటువంటి విపత్తు వచ్చిన ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. రాష్ట్రం ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాలో రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా నూర్పుడు చేసిన పంట పొలాల నుంచి ధాన్యాన్ని మిల్లులు చేర్చడం జరుగుతోందన్నారు. ఈ మేరకు రవాణా నిమిత్తం లారీలు, గన్ని బ్యాగులు అందుబాటులో ఉంచామన్నారు. జిల్లాలోని 24 గంటలు రైస్ మిల్లులు అందుబాటులో ఉండే విధంగా ఆదేశాలను జారీ చేశామన్నారు. పరిస్థితిని జాయింట్ కలెక్టర్, ఇతర ఉన్నతాధికారులు పర్యవేక్షణ చేస్తూ, క్షేత్ర స్థాయి లో పర్యటించడం జరిగిందన్నారు.

ఇప్పటివరకు పంట పొలాల్లో కోతలు కోయని పంట ఉంటే వర్షాలు తగ్గేవరకు ఆ రైతులు కోతలు కోయవద్దని, వాతావరణ అనుకూలించిన తర్వాత మాత్రమే కోయాలని కోరారు. వ్యవసాయ అధికారులు, శాస్త్ర వేత్తల సూచనలు పాటించాలని కోరడం జరిగింది. తద్వారా పంట నష్టాన్ని కూడా నివారించ గలుగుతామని కలెక్టర్ అన్నారు. తుఫాన్ వలన ఏ ప్రాంతంలో నీరు నిల్వ ఉన్న ఎన్ఆర్ఈజీఎస్ ఉపాధి హామీ మాండి డేట్స్ కల్పించడం ద్వారా నీటి నిలవను తొలగించే విధంగా చర్యలు చేపడుతున్న పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రాణ నష్టం, పశువులు నష్టం ఉండకూడదని, ఇప్పటికే కోసిన పంటను కాపాడి రైతులకు నష్టం లేకుండా ఆదుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. ఆ మేరకు జిల్లా యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఎప్పటి కప్పుడు పరిస్థితి సమీక్ష చేస్తున్నామని, రైతుకి భరోసా ఇస్తూ ఆఫ్ లైన్ ద్వారా కొనుగోళ్లు చేపట్టామన్నారు. ఇప్పటికే క్షేత్ర స్థాయి లో జాయింట్ కలెక్టర్ గత రెండు రోజులుగా ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉన్నట్లు తెలియ చేశారు.

జిల్లా డివిజన్ మండల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రజలను అప్రమత్తం చేసేందుకు గ్రాస్ రూట్ లో ఉన్న వాలంటీర్ సేవలను వినియోగించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఇప్పటికే రెవెన్యూ, వ్యవసాయ, ఇతర శాఖలని అప్రమత్తమై రైతులకు అందుబాటులో ఉన్నారని మాధవీలత తెలిపారు.

కలెక్టరేట్, బొమ్మూరు.. 8977935609

ఆర్డీవో రాజమండ్రి .. 0883-2442344

ఆర్డీవో కొవ్వూరు ..  08813231488

జిల్లాలో ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, విద్యుత్ , ఫైర్ సర్వీస్ అధికారుల 10 టీములుగా ఏర్పాటు చేసి సిద్ధంగా ఉంచామని, వీరు తుఫాన్ వల్ల ఎక్కడ సమస్య ఎదురైనా వెంటనే ఆ బృందాలు ఆయా ప్రాంతాలకు వెళ్లి కూలిన చెట్లు తొలగించటంతో పాటు ఇతర సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలిపారు.

విద్యుత్ సమస్యలు ఎత్తకుండా ట్రాన్స్ఫార్మర్లను అందుబాటులో ఉంచామని అదేవిధంగా తుఫాను కారణంగా ఎక్కడ విద్యుత్ స్తంభాలు ఒరిగిన విరిగిపోయిన వెంటనే పునరుద్ధరణ చేసేందుకు గాను 500 స్తంభాలను ముందస్తు జాగ్రత్తగా సిద్ధం చేయడం జరిగిందని కలెక్టర్ పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *