Breaking News

వర్షాలు తగ్గే వరకు కోతలు చేపట్టవద్దు

-తెరిపి ఇచ్చిన వెంటనే మిల్లులకు తరలించాలి
-పంట పొలాల్లో నీరు నిలవ లేకుండా చూడాలి
-కలెక్టర్ మాధవీలత

కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
కోతలు పూర్తి చేసి మిల్లులకు పంపని ధాన్యం తడవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డా కె. మాధవీలత సూచించారు. మంగళవారం కొవ్వూరు మండలం కాపవరం గ్రామంలో హార్టికల్చర్, ప్యాడి పంటల ను క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాధవీలత మాట్లాడుతూ, ప్రస్తుత వాతావరణ మార్పులు నేపథ్యంలో కోతలు కోసిన పంటలను మిల్లులకు తరలించడం జరిగిందన్నారు. రానున్న 2 , 3 రోజుల్లో వర్షా భావ పరిస్థితి ఉండడం వల్ల ప్యాడి కోతలు కొయ్యారాదని విజ్ఞప్తి చేశారు. కోతలు కోసిన పంట విషయంలో తడవ కుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. మెరక ప్రాంతాల్లో, సురక్షిత ప్రాంతాలలో పంటను భద్ర పరచాలని విజ్ఞప్తి చేశారు. పనలు మీద ఉన్న పంటలు, ఉద్యానవన పంటలు పండే పొలాల్లో నీరు నిలవ లేకుండా దిగువకు పారే విధంగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. వర్షాభావ పరిస్థితులు తగ్గిన తర్వాత తెరిపి వచ్చాక వెంటనే మిల్లులకు తరలించడం జరుగుతుందని స్పష్టం చేశారు. రైతులు ఎప్పటి కప్పుడు అధికారులకు అందుబాటులో ఉండాలని, వ్యవసాయ అధికారుల, శాస్త్రవేత్తల సూచనలు పాటించాల్సి ఉంటుందన్నారు. మండలంలో 10200ఎకరాల్లో ప్యాడి సాగు విస్తీర్ణం లో పది వేల ఎకరాల్లో కోతలు కోసినట్లు, ఇంకా సుమారు 200ఎకరాలు సిద్ధంగా ఉన్నట్లు అధికారులు వివరించారు. కలెక్టర్ వెంట ఆర్డీవో కృష్ణ నాయక్, డి ఎ వో – ఎస్. మాధవ రావు, డి హెచ్ ఓ అరుణ కుమారి, తహశీల్దార్ బి. నాగరాజు నాయక్, ఇతర వ్యవసాయ అనుబంధ అధికారులు, రైతులు సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *