-కోతలు కోసిన పంటను జాగ్రత్త చెయ్యాలి
అనపర్తి, నేటి పత్రిక ప్రజావార్త :
కోతలు కోసిన పంటలను ఎప్పటి కప్పుడు మిల్లులకు తరలించాల్సి ఉంటుందని జాయింట్ కలెక్టర్ ఎన్.. తేజ్ భారత్ స్పష్టం చేశారు. మంగళవారం అనపర్తి మండలం దుప్పలపూడి, పాలమూరు గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో జాయింట్ కలెక్టర్ పర్యటించారు . రాశులుగా , కుప్పలుగా ఉన్న ధాన్యం ఉండడాన్ని చూసి రైతులతో ముఖా ముఖి సంభాషించారు. ఈ సందర్భంగా జేసీ ఎన్. తేజ్ భరత్ రైతులతో మాట్లాడుతూ , కోతలు పూర్తి చేసిన మిల్లులకు ఎందుకు తరలించ లేదని అడిగారు. వాతావరణ మార్పులు, హెచ్చరికల నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఇటువంటి సమయాల్లో ఎప్పటి కప్పుడు మిల్లులకు, సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందన్నారు. వ్యవసాయ అధికారులు కోతలు కోసిన పంటను తరలించేందుకు వాహనాలు ఏర్పాటు చేశారు. అగ్రికల్చర్ సొసైటీ ఆధ్వర్యంలో హమాలీ లను ఏర్పాటు చేయాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. కోతలు పూర్తి చేసిన పంటలు పనలు గా ఏర్పాటు చేసుకుని రాశులు వెయ్యడం జరిగిందని, వర్షాలు తగ్గిన తదుపరి నూర్చి మిల్లులకు పంపనున్నట్లు కౌలు రైతులు జేసీ వివరించారు. ఈ పర్యటన లో జాయింట్ కలెక్టర్ వెంట తహశీల్దార్ సరస్వతి, వ్యవసాయ అధికారి బి. సురేష్ కుమార్, అర్భికే సిబ్బంది, రైతులు ఉన్నారు.
Prajavartha Online Telugu News