గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నుండి అందిన ఆర్జీలు, ఫిర్యాదులను వెంటనే క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పరిష్కరించాలని నగర కమిషనర్, తూర్పు నియోజకవర్గ ఈఆర్ఓ కీర్తి చేకూరి తెలిపారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో ఎన్నికల సంఘం గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో నూతన ఓటు దరఖాస్తులు, ఫిర్యాదుల పరిష్కారం తదితర అంశాలపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల మేరకు రాజకీయ పార్టీల ప్రతినిధులు సమావేశాల్లో అందించిన ఫిర్యాదులు, అర్జీలను క్రమ పద్దతిలో రికార్డ్ చేసి, క్షేత్ర స్థాయి పరిశీలనకు బిఎల్ఓలకు పంపాలని ఆదేశించారు. ఈ నెల 2,3 తేదీల్లో జరిగన స్పెషల్ క్యాంపెయిన్ డేస్ ల్లో వచ్చిన వివిధ ఫారాలను పరిశీలించి, పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పిఎస్ఈ (ఫోటో సిమిలర్ ఎంట్రీలు)/డిఎస్ఈ (డెమోగ్రాఫిక్ సిమిలర్ ఎంట్రీలు) ఉన్న ఓటర్లకు ఫార్మేట్-ఏ ద్వారా రిజిస్టర్ పోస్ట్ చేశామని, ఓటర్లు తమ ఓటు ఎక్కడ ఉంచాలో/తొలగించాలో కన్ఫర్మేషన్ లెటర్ ద్వారా తెలియచేయాలన్నారు. సమావేశంలో పశ్చిమ ఈఆర్ఓ, అదనపు కమిషనర్ కె.లక్ష్మీ శివ జ్యోతి, ఏఈఆర్ఓలు బి.శ్రీనివాసరావు, ప్రదీప్ కుమార్, కోటయ్య, సూపరిండెంట్లు సాంబశివరావు, పద్మ, రాజకీయ పార్టీలైన టిడిపి నుండి ఓంకార్, బిఎస్పి నుండి సిహెచ్.వాసు, బిజెపి నుండి ఆర్.భాస్కర్రావు, అమ్ ఆద్మీ నుండి సేవకుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News