గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలోని రైల్వే లెవల్ క్రాసింగ్ ల వద్ద ఆర్.ఓ.బి. లేదా ఆర్.యు.బి.ల నిర్మాణాల వలన చుట్టు పక్కల్ ఎన్ని భవనాలు ప్రభావితం అవుతాయి, నష్ట పరిహారాలు ఎంత అవుతాయి అని జిఎంసి నుండి సర్వే చేయాలని నగర కమిషనర్ కీర్తి చేకూరి ఎస్.ఈ., సిటి ప్లానర్ లను ఆదేశించారు. మంగళవారం కమిషనర్ చాంబర్ లో రైల్వే, జిఎంసి అధికారులతో నగరంలోని రైల్వే క్రాసింగ్ పాయింట్స్ వద్ద ఆర్.యు.బి.ల నిర్మాణం పై తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో శ్యామలా నగర్, నెహ్రు నగర్, సీతా నగర్, సంజీవయ్య నగర్, గడ్డిపాడు ప్రాంతాల్లోని రైల్వే క్రాసింగ్ పాయింట్స్ వద్ద ఆర్.ఓ.బి. లేదా ఆర్.యు.బి.ల నిర్మాణ ప్రతిపాదనలు ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్నాయని, సదరు ప్రాంతాల్లో ఆర్.ఓ.బి. లేదా ఆర్.యు.బి. ల నిర్మాణం వలన ఎన్ని భవనాలు ప్రభావితం అవుతాయి, వాటికి నష్ట పరిహారాలు ఎంత అవుతుందో రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని సిటి ప్లానర్, ఎస్.ఈ.ని ఆదేశించారు. నివేదిక మేరకు రైల్వే అధికారులు, జిఎంసి అధికారులతో జాయింట్ ఇన్స్పెక్షన్ చేసి తుది నివేదికను రైల్వే బోర్డ్ కి పంపడం వలన నిర్మాణ అనుమతులు వస్తాయని తెలిపారు. సమావేశంలో రైల్వే డిప్యూటీ సి.ఈ. నోయల్, కన్సల్టెంట్ హనుమరెడ్డి, జిఎంసి ఎస్ఈ (ఎఫ్ఏసి) సుందర్రామి రెడ్డి, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News