Breaking News

డిసెంబర్ 27 నుండి మున్సిపల్ వర్కర్ల సమ్మె

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 27 తేదీనుండి మున్సిపల్ వర్కర్స్ సమ్మె చేపడుతున్నట్లు, మున్సిపల్ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ పోరుమామిళ్ల సుబ్బారాయుడు, కో -కన్వీనర్లు ఎంవి రమణ, (వైయస్సార్ టి యు సి) నాయకులు గొట్టుముక్కల రఘురామరాజు టి ఎన్ టి యు సి నాయకులు ,మధు శంకర్రావు, తెలిపారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లోగురువారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందిని ,పర్మినెంట్ చేస్తానన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వాగ్దానాన్ని విస్మరించారని, ఈ దశలో మున్సిపల్ కార్మికులకు సమ్మె శరణ్యమైందని ,వారు తెలిపారు. కార్మికులకు ఇవ్వవలసిన వేతనాల్ని. ఇవ్వవలసిన, బకాయిలను, ఇవ్వాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని లేనిపక్షంలో జరగబోవు సమ్మెకు ప్రభుత్వ బాధ్యత వహించవలసి వస్తుందని వారు హెచ్చరించారు. మున్సిపల్ కార్మికుల డిమాండ్ల సాధనకై దశలవారి ఆందోళనలు చేపట్టి డిసెంబర్ 27 నుండి మున్సిపల్ సమ్మె సైరన్ ముగిస్తామని వారు తెలిపారు.మున్సిపల్ కార్మిక సంఘాల జే.ఏ.సీ. కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *