Breaking News

ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి పనులను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకుల మీదే ఉంది అని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ వైసీపీ శ్రేణులకు సూచించారు. శనివారం నియోజకవర్గ పరిధిలోని 16,21 డివిజన్ లలో ఆయా డివిజన్ ల పార్టీ కార్యాలయాల్లో నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమీక్ష సమావేశాల్లో అవినాష్ ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ పిలుపు మేరకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ గతంలో మునుపెన్నడూ లేనివిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వినూత్న పథకాలతో జనరంజక పరిపాలన అందిస్తున్నారని కానీ ప్రతిపక్ష పార్టీలు వారి రాజకీయ మనుగడ కోసం అనుకూల మీడియా అడ్డుపెట్టుకుని అసత్య ప్రచారాలు చేయడం సిగ్గుచేటు అని విమర్శించారు. పార్టీ పిలుపు మేరకు నాయకులు, కార్యకర్తలు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారాలు త్రిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించాలని సూచించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్ లిస్ట్ ల మీద ప్రత్యేక దృష్టి పెట్టీ ఎలాంటి అవకతవకలు లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సీనియర్ నాయకులు కడియాల బుచ్చి బాబు, 16వ డివిజన్ కార్పొరేట్ ఉమ్మడిశెట్టి రాధికా, 21 వ డివిజన్ కార్పొరేటర్ పుప్పాల కుమారి, మండల కన్వీనర్ ఉమ్మడిశెట్టి బహుదూర్, గుమ్మడి విజయ్ కుమార్, డివిజన్ అధ్యక్షులు చెన్నంశెట్టి రామకృష్ణ, టి. పి రెడ్డి, క్లస్టర్ ఇంచార్జి సాయి కృష్ణ రెడ్డి, రామకృష్ణ, వేముల కొండా, వెంకట్, కసగాని దుర్గారావు, షైక్ కాజా, బాజీ, దూడల రజని, పడాల మాధవి మరియు ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఫిన్ బండి వితరణ
దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 16వ డివిజన్ కి చెందిన దొడ్డి రమణ కి జీవనోపాధి నిమిత్తం దాదాపు రూ.10,000/- విలువ గల టిఫిన్ బండిని దేవినేని నెహ్రూ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అవినాష్ ఉచితంగా అందజేసారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *