Breaking News

అర్హతే ప్రామాణికం – ప్రతిఒక్కరికీ సంక్షేమం

– రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు మల్లాది విష్ణు
-36 వ డివిజన్ 196 వ వార్డు సచివాలయం పరిధిలో రెండో రోజు గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అర్హతే ప్రామాణికం – ప్రతిఒక్కరికీ సంక్షేమం నినాదంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 36 వ డివిజన్ 196 వ వార్డు సచివాలయం పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శనివారం సందడి వాతావరణంలో సాగింది. స్థానిక కార్పొరేటర్ బాలి గోవింద్ తో కలిసి బావాజీపేటలో ఎమ్మెల్యే పర్యటించారు. 347 ఇళ్లను సందర్శించి ప్రజల నుంచి అర్జీలు, సూచనలు స్వీకరించారు. దేశంలోనే సంక్షేమ కార్యక్రమాలను శాచ్యురేషన్ విధానంలో గడప గడపకు చేరవేస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వమని మల్లాది విష్ణు చెప్పుకొచ్చారు. గత తెలుగుదేశం ప్రభుత్వం పేదలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని.. కానీ నేడు ఏ గడప తొక్కినా కనీసం 3 నుంచి 8 పథకాల ద్వారా లబ్ధి చేకూరిన కుటుంబాలే దర్శనమిస్తున్నాయన్నారు. ప్రజల వద్దకు పాలన చేరువ చేస్తూ.. సంక్షేమ పథకాలు లబ్ధిదారుని ఇంటి వద్దకే అందిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వంపై ఈ సందర్భంగా స్థానికులు ప్రశంసల జల్లు కురిపించారు. రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి అహర్నిశలు పాటుపడుతున్న సీఎం వైఎస్‌ జగన్మోహన్ రెడ్డికి తమ మద్ధతు ఎల్లప్పుడూ ఉంటుందని వెల్లడించారు. అనంతరం మల్లాది విష్ణు మీడియాతో మాట్లాడారు.

ఎన్నికలు పారదర్శకంగా జరగాలన్నదే సీఎం జగన్ ఆకాంక్ష
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఫిర్యాదుపై ఎలక్షన్ కమిషనర్ స్పందించిన తీరు హర్షణీయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. దొంగ ఓట్లు నమోదు చేయించడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని.. తెలంగాణ నుంచి పెద్దసంఖ్యలో డూప్లికేట్ ఓట్లను ఏపీకి తీసుకువచ్చే కుట్రలు జరుగుతున్నాయని ఆరోపించారు. తెలంగాణలోని ఓ ప్రాంతంలో బహిరంగంగానే ఏపీకి సంబంధించి ఓట్లు నమోదు చేయబడునని బోర్డు పెట్టి మరీ డూప్లికేట్ ఓట్లను నమోదు చేయిస్తున్నారని పేర్కొన్నారు. ఇలా పక్క రాష్ట్రాలతో పాటు ఏపీలోనూ నమోదైన 4 లక్షల 30 వేల 264 డూప్లికేట్ ఓట్లను గుర్తించిన తాము.. ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. తెలంగాణలో ఓటు వేసిన వారిని తిరిగి ఏపీలో ఓటు వేయకుండా చూడాలని కోరడం జరిగిందన్నారు. వీటిపై స్పందించిన ఎలక్షన్ కమిషన్.. తప్పుడు సమాచారంతో ఓటర్ నమోదుకు ప్రయత్నించే దరఖాస్తుదారులపై పీపుల్స్ యాక్ట్ 1950 సెక్షన్ 31 ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడం జరిగిందన్నారు. ఫారమ్ 6 అనేది మొదటసారి ఎన్ రోల్ చేసుకునేవారు వినియోగించాలని.. కానీ ఫారమ్ 6 ఉపయోగించి 30 ఏళ్లు పైబడిన ఓటర్లను టీడీపీ నమోదు చేయిస్తోందని మల్లాది విష్ణు ఆరోపించారు. తెలుగుదేశం చేస్తున్న ఇటువంటి కుట్ర రాజకీయాలకు రానున్న ఎన్నికల్లో మరోసారి గట్టి గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు పులపా కృష్ణ, రామకృష్ణ, రెడ్యం ఆర్కే, రాడ భాస్కర్, యడ్ల రాంబాబు, పఠాన్ భూపతి, ఇప్పిలి శ్రీను, పప్పుల శివ, తాటి శివ, అరుణ్ బాబు, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *