Breaking News

ఆంధ్ర హాస్పిటల్స్ లో ఉచిత పిల్లల గుండె సర్జరీలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర హాస్పిటల్స్‌లో ఫీలింగ్‌ లిటిల్‌ ఆర్ట్స్‌ యూకే చారిటీ సౌజన్యంతో 27వ ఉచిత పిల్లలకు సర్జరీలు క్యాంపు డిసెంబర్‌ 4 నుంచి డిసెంబర్‌ 9 వరకు జరిగిందని ఆంధ్ర హాస్పిటల్‌లో హార్ట్‌ అండ్‌ బ్రెయిన్‌ శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో చీఫ్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ సర్వీసెస్‌ పి.వి.రామారావు తెలియజేశారు. ఆంధ్ర హాస్పిటల్స్‌లో చిల్డ్రన్స్‌ హార్ట్‌ ఇనిస్టిట్యూట్‌ కార్డియాక్‌ టీం అండ్‌ కార్డయాక్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ టీం సహకారంతో ప్రతిరోజు గుండె ఆపరేషన్‌ నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. గత ఎనిమిది సంవత్సరాల నుండి ఇప్పటివరకు 27 సార్లు ఆంధ్ర హాస్పిటల్స్‌కు వచ్చి పిల్లలకు గుండె సర్జరీలు విజయవంతంగా చేశారని, మున్ముందు కూడా ఈ రకమైన గుండె ఆపరేషన్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి ఆంధ్ర హాస్పటల్‌ వచ్చి చేస్తున్నారని, ఆంధ్ర హాస్పటల్లో ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక పిల్లల కార్డియాక్‌ సర్జరీలు నెలకు 50 నుంచి 60 ఆపరేషన్‌ చొప్పున, సంవత్సరానికి 600 గుండె ఆపరేషన్లు చేస్తున్నామని, ఇప్పటివరకు 3,500 పైన మరియు ఇంటర్వెన్షన్స్‌ విజయవంతంగా చేశామని తెలియజేశారు. ఈ క్యాంపులో డాక్టర్‌ ఎం.బీ.వి.ప్రసాద్‌, హైదరాబాద్‌, సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ కూడా ఆర్థిక సహాయం చేశారని ఆయన తెలియజేశారు. పిల్లల గుండె జబ్బులు ఉన్నవారు రెండు తెలుగు రాష్ట్రాల నుండి మన ఆస్పత్రికి వస్తున్నారని చెప్పారు. ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించినందుకు ఆంధ్ర హాస్పిటల్స్‌ మరియు హీలింగ్‌ లిటిల్‌ హార్ట్స్‌, యూకే డాక్టర్లుకు మరియు నర్సులు వైద్య బృందానికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్‌ విక్రమ్‌, పిల్లలు కార్డియాలజిస్ట్‌, డాక్టర్‌ శ్రీమన్నారాయణ, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌, డాక్టర్‌ రమేష్‌, కార్డియాక్‌ ఎన్‌ స్టిటిస్ట్‌, డాక్టర్‌ కృష్ణప్రసాద్‌, పిల్లల కార్డియాక్‌ ఇంటెన్సివిస్ట్‌, డాక్టర్‌ ప్రియ, పిల్లల కార్డియాక్‌ ఇంటెన్సివిస్ట్‌, పిల్లలు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంద్రకీలాద్రిపై భక్తులకు సరికొత్త సేవలు- రాష్ట్రంలోనే తొలిసారిగా ‘లడ్డూ ప్రసాదం ఏటీఎం’ ప్రారంభం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం (ఇంద్రకీలాద్రి) కొండ దిగువన, అర్జునవీధి ప్రారంభంలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *