Breaking News

ఈ నెల 25 నాటికి గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్ష‌న్ భూ సేక‌ర‌ణను పూర్తిచేయాలి

– ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.సంప‌త్ కుమార్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్‌హెచ్‌-163జీలో భాగ‌మైన ఖ‌మ్మం-విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్ష‌న్‌కు సంబంధించి ఎన్‌టీఆర్ జిల్లాప‌రిధిలో భూసేక‌ర‌ణ ప్ర‌క్రియ‌ను ఈ నెల 25 నాటికి పూర్తిచేసేందుకు కృషిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ అధికారుల‌ను ఆదేశించారు. ఖ‌మ్మం-విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్ష‌న్ భూసేక‌ర‌ణ పురోగ‌తిపై జాయింట్ క‌లెక్ట‌ర్ డా. పి.సంప‌త్ కుమార్ జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ), రెవెన్యూ త‌దిత‌ర శాఖ‌ల అధికారుల‌తో క్యాంపు కార్యాల‌యం నుంచి బుధ‌వారం వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ మాట్లాడుతూ నాగ‌పూర్‌-విజ‌య‌వాడ కారిడార్ కింద ఎన్‌హెచ్‌-163జీలో భాగంగా ఖ‌మ్మం-విజ‌య‌వాడ గ్రీన్‌ఫీల్డ్ హైవే సెక్ష‌న్ అలైన్‌మెంట్‌కు 2019లో జాతీయ ర‌హ‌దారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్ఏఐ) ఆమోదం ల‌భించిన‌ట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఎన్‌టీఆర్ జిల్లాలో గంప‌ల‌గూడెం, జి.కొండూరు, విజ‌య‌వాడ రూర‌ల్ మండ‌లాల ప‌రిధిలో 15 గ్రామాల్లో జ‌రుగుతున్న 243 ఎక‌రాల భూసేక‌ర‌ణలో భాగంగా 11 గ్రామాల‌కు సంబంధించి అవార్డుల‌ను ఇప్ప‌టికే పాస్ చేయ‌డం జ‌రిగింద‌ని.. మిగిలిన నాలుగు గ్రామాలకు సంబంధించిన ప్ర‌క్రియ‌ను ఈ నెల 25 నాటికి పూర్తిచేయాల‌ని జాయింట్ క‌లెక్ట‌ర్ సంప‌త్ కుమార్ ఆదేశించారు. స‌మావేశంలో నేష‌న‌ల్ హైవేస్ ప్రాజెక్టు ఇంప్లిమెంటేష‌న్ యూనిట్ (ఖ‌మ్మం) పీడీ దుర్గాప్ర‌సాద్‌, భూ సేక‌ర‌ణ అధికారులు, త‌హ‌సీల్దార్లు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *