Breaking News

డంప్ సైట్ లో నిర్మాణమౌతున్న అందమైన 3d సూక్ష్మ మోడల్స్ ఇన్ఫర్మేషన్ పార్కు

-కమిషనర్  స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్.

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అభివృద్ధి చెందుతున్న సింగ్ నగర్ ఎక్సెల్ ప్లాంట్ లోని ఇన్ఫర్మేషన్ పార్కు ను బుధవారం నగర కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి ప్లాంట్లు నందు ఆధునికీకరణ పనులను పరిశీలించి అక్కడ జరుగుతున్న పనులను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చారు. ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ఎలా జరుగుతుంది, వ్యర్థ పదార్థాల నుండి ఉపయోగపడే వస్తువులను ఎలా తయారు చేస్తున్నారు అన్న దాని గురించి ప్రజలకు, విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించే మ్యూజియం ఇన్ఫో పార్క్ లో త్వరగా పూర్తి చేయాలని, వ్యర్థ పదార్థాల నిర్వహణ చూపించే సూక్ష్మ 3d మోడల్స్ పనులు ఎంతవరకు అయ్యాయని, ఏర్పాటు చేస్తున్న అధికారులతో మాట్లాడి ఇంకా ప్రజలకు త్వరగా అర్థమయ్యే రీతిలో ఎలా చేయగలరు అన్న దాని మీద సూచనలు ఇచ్చి ఇన్ఫర్మేషన్ పార్క్ త్వరలో ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఎక్సెల్ ప్లాంట్ లో ఫ్లవర్ వేస్ట్ మేనేజ్మెంట్, విండో కంపోస్టింగ్, వర్మి కంపోస్ట్ ప్లాంట్, బయో మిథనేషన్ ప్లాంట్, ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మ్యానేజ్మెంట్ ప్లాంట్ల, మినీ సూయేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, ట్రీ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, టౌన్ ప్లానింగ్ సెక్షన్ స్క్రాప్, స్క్రాప్ ప్లేసింగ్ యూనిట్, మాట్రేస్స్ వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్, సి&డి వేస్ట్ రీసైక్లింగ్ యూనిట్ ల గురించి త్రీడి పద్దతిలో ప్రతేక్షంగా విద్యార్థులకు, పిల్లలకు, ప్రజలందరికీ సమాచారాన్ని చూపించడమే ఇన్ఫర్మేషన్ పార్కు యొక్క ముఖ్య ఉద్దేశ్యం అని కమీషనర్ అన్నారు. పార్కు ఆవరణలో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అధికారులకు పలు ఆదేశాలు చేసారు.
ఈ పర్యటనలో అదనపు కమిషనర్ (ప్రాజెక్ట్స్)  కె.వి సత్యవతి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏ.ఎస్.ఎన్ ప్రసాద్, ఏ.డి.హెచ్ శ్రీనివాసు, డిసిపి జుబిన్ సిరెన్ రాయ్, శానిటరీ ఇన్స్ పెక్టర్లు, తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *