Breaking News

32వ డివిజన్లో “వై ఏపీ నీడ్స్ జగన్” కార్యక్రమం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
32 వ డివిజన్ అయోధ్యనగర్లోని 231 వ వార్డు సచివాలయ పరిధిలో బుధవారం జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో రాష్ట్ర ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కోఆప్షన్ సభ్యురాలు గుండె సుభాషిణి, వైసీపీ డివిజన్ ఇంఛార్జి గుండె సుందర్ పాల్ పాల్గొన్నారు. తొలుత పార్టీ జెండాను ఎగురవేసి, మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం సచివాలయ కార్యాలయం వద్ద సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. 231 వ వార్డు సచివాలయ పరిధిలో గత నాలుగున్నరేళ్లలో డీబీటీ ద్వారా 7 కోట్ల 4 లక్షల 82 వేల 68 రూపాయల మేలు చేకూర్చగా.. నాన్ డీబీటీ ద్వారా 5 కోట్ల 11 లక్షల 4 వేల 940 రూపాయలు.. మొత్తంగా 12 కోట్ల 15 లక్షల 87 వేల 8 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, లబ్ధిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *