Breaking News

పేదల అభ్యున్నతే లక్ష్యంగా అడుగులు

-61వ డివిజన్ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పేదల అభ్యున్నతే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షులు, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 61 వ డివిజన్ 262వ వార్డు సచివాలయ పరిధి శాంతినగర్లో జరిగిన ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో బుధవారం స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. తొలుత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘన నివాళులర్పించి.. పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం సచివాలయంలో సంక్షేమ పథకాల బోర్డును ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. చంద్రబాబు చేతగాని పాలనకు, జగనన్న సమర్థ పాలనకు మధ్య వ్యత్యాసాన్ని ప్రజలకు వివరించారు. 2014లో 648 వాగ్దానాలిచ్చి.. ఏ ఒక్కటీ చంద్రబాబు పూర్తిగా నెరవేర్చలేదని గుర్తుచేశారు. పైగా తెలుగుదేశం హయాంలో ప్రభుత్వ పథకాలు అందాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేదని.. కానీ సీఎం జగన్మోహన్‌ రెడ్డి పాలనలో ఇంటి చెంతకే సంక్షేమ పథకాలు అందుతున్నాయని చెప్పుకొచ్చారు. 262 సచివాలయ పరిధిలో 1,440 కుటుంబాలకుగానూ 4,892 మంది జనాభా ఉన్నట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీరిలో 1,240 కుటుంబాలకు తెల్ల రేషన్ కార్డులు ఉండగా.. 1,355 కుటుంబాలు ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా అన్ని రకాల వైద్య సేవలు పూర్తి ఉచితంగా పొందుతున్నట్లు చెప్పారు. అలాగే డిబిటీ ద్వారా సచివాలయ పరిధిలో ఇప్పటివరకు 14 కోట్ల 81 లక్షల 32 వేల 742 రూపాయల లబ్ధి చేకూర్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. 398 మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర చరిత్రలో పేదలకు ఇంతలా సహాయం అందించిన ప్రభుత్వం మరొకటి లేదని ఈ సందర్భంగా కితాబిచ్చారు. కనుకనే జ‌గ‌న‌న్నని మ‌రలా ముఖ్యమంత్రిగా గెలిపించుకుందామ‌ని.. అభివృద్ధి, సంక్షేమం నిర్విరామంగా కొన‌సాగేలా మ‌ద్దతు ఇవ్వాల‌ని ప్రజలను కోరారు. కార్యక్రమంలో నాయకులు, సచివాలయ సిబ్బంది, కన్వీనర్లు, గృహ సారథులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *