Breaking News

నగరంలో సినీ హీరోయిన్ కృతిశెట్టి సందడి


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో సినీ హీరోయిన్ కృతిశెట్టి సందడి చేసింది. బందర్ రోడ్ లోని స్వాతి షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి కృతి శెట్టి ముఖ్య అతిధిగా విచ్చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాల్ లోని పలు రకాల డిజైనర్ సారీస్ ను తిలకించారు. ఈ సందర్భంగా చేనేత కార్మికులు తయారుచేసిన 4లక్షల సారీని ఆమె ప్రదర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను విజయవాడకు రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.ఈ షోరూమ్ లో మగువులు మెచ్చే వివిధ రకాల డిజైన్లు ఇక్కడ ఉన్నాయని తెలిపారు. కేవలం మహిళల కోసమే ఇన్ని రకాల డిజైన్లు పొందపరచడం అభినందియమని ఆమె కొనియాడారు. ఈ ప్రారంభంలో నగరమేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైసిపి తూర్పు ఇంచార్జ్ దేవినేని అవినాష్, కార్పోరేటర్ రహానే లు పాల్గొని తమ అభిప్రాయాలను వారు వెల్లడించారు. అనంతరం స్వాతి షోరూమ్ నిర్వాహకులు ఊర వెంకట రమణ మాట్లాడుతూ 63సంవత్సరాల క్రితం ప్రారంభమైన తమ సంస్థ అంచలంచలుగా ఎదిగి ఉన్నత స్థానంలో ఉందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లోనే వస్త్ర వ్యాపారంలో చీరాలది ప్రముఖ స్థానం అని, ఆ చీరాలలోనే నెంబర్ వన్ గా తమ సంస్థ నిలిచిందని చెప్పారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా చీరాలకి తమ సంస్థకు వస్తారని పేర్కొన్నారు. ఇప్పటివరకు ఆరు బ్రాంచ్లో తమ సంస్థ ఉందని తెలియజేశారు. తమ సంస్థలో 200 రూపాయల శారీల నుంచి ఐదు లక్షల శారీల వరకు ఉందని తెలిపారు. భారతదేశంలోనే ఎన్నడూ లేని విధంగా తమ సంస్థలోనే మహిళల కోసమే ఈ షాపింగ్ మాల్ ను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *